పుట:కాశీమజిలీకథలు -02.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంతిమతి కథ

189

మిక్కిలి తొందరపెట్టగా నా బలభద్రు నింటికడ నుండుమని చెప్పి యప్పురుషసింహు డప్పుడే దానివెంట బోయెను.

అచ్చతురిక యారాజపుత్రుని ముందుగా దనయింటికి దీసికొనిపోయి కృతజ్ఞత జూపించుదానివలె నభినయించుచు బన్నీట జలక మార్చినది మరియు జీనాంబరములు గట్టనిచ్చినది. మణివిభూషణములు దెచ్చి స్వయముగా నలంకరించినది. అది యంతయు జూచి యతడు చతురికా! యీవేషము నాకేల? నేను ద్వరగా బోవలయును. మీరాజపుత్రిక యెచ్చటనున్నదని యడుగగా నప్పడతి ఆర్యా! నీవు తొందరపడకుము. రాజపుత్రికను జూపుటకొరకే మీకీ యలంకారము చేయుచుంటిని. ఈ యలంకారములకు మీశరీర మలంకారము దెచ్చుచున్నది. చూచితిరా! యని పలుకుచు నతనిమతికి గుతుకము గూర్చుచున్న సమయమున నశ్వశకటమువచ్చి చతురికా! భర్తృదారిక యుద్యానవనమునకు బోయి నీకొరకు బండి పంపినది. సత్వరముగా రావలయుననుటయు నది నీవు పొమ్ము నే నీబండి నెక్కి యిప్పుడే పోయెదనని చెప్పి యప్పరిచారిక పోయిన తరువాత నదృష్టదీపుని మేనంతయుబట్టు మేలిముసుగువైచి స్త్రీపురుషవివక్షత దెలియకుండ నాబండి యెక్కించినది.

అప్పుడతం డిట్టట్టనక యదిచెప్పినట్లు చేయుచు నాబండిలో గూర్చుండెను. పిమ్మట నమ్ముదితయు సమ్మోదముతో శకటమెక్కి వడిగాదోలి యుద్యానవనములోనికి దీసికొనిపొమ్మని యాబండితోలువాని కాజ్ఞాపించెను. ఆబండివాడు అది చెప్పిన ప్రకారముగా వడిగా గుఱ్ఱముల నడిపించుచు దృటిలో నాయుద్యానవనములోనున్న విలాససౌధమునకు దీసికొనిపోయెను.

అచ్చట జతురిక రాజపుత్రునితోగూడ లోపలకు బోయినది. అంతకు బూర్వమే వారేర్పరచుకొనియున్నవారు కావున నామేడలో నితరు లెవ్వరునులేరు. ముందు తలుపులు బిగించి యాచతురిక యాతనిని మేడ యెక్కించి యాముసుగు దీయుచు రాజపుత్రికయున్న గదిలోనికి దీసికొనిపోయినది.

అతనిరాక చూచి యాచిన్నది సంతోషముతో మేను గరపుజెంద దత్తరిల్లుచు బంగారుపళ్లెరముతో నివాళిదెచ్చి యెదురవచ్చెను. అక్కలికి తొలుత నతనిపాదంబులం గడగి తడియొత్తుచు గర్పూరపునివాళియిచ్చి లజ్జావశంబున నూరకున్నంత జతురిక దానింజూచి భర్తృదారికా! నీవతిథిపూజ చక్కగా జేయుము. సిగ్గుపడి యూరకుండిన నతిథికి గోపము వచ్చునుసుమీ? యని పలుకగా నక్కాంతిమతి యానృపసూతి చెట్ట పట్టుకొని ఆర్యపుత్రా! మీరాకచే మాగృహము పవిత్రమైనది లోపలకు దయచేసి మమ్ము గృతార్దులం జేయుడని పలుకుచు నల్లన దీసికొనిపోయి యంతకమున్న యమర్చి యున్న సయ్యపై గూర్చుండబెట్టి తానాదాపున నిలువంబడియెను.

ఇంతలో జతురికవచ్చి మచ్చెకంటీ! నీవిచ్చట నిలువబడితివేల? అతిథి నర్పింప దల్పమెత్తుగానున్నది. నీవుగూడ దానిమీద గూర్చుండి పూజింపుము. ఇట్టి