పుట:కాశీమజిలీకథలు -02.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంతిమతి కథ

187

నచ్చట నుండిన బాగుండును సుమీ! మన ముండినచో నతం డుండునా చెప్పుము? అట్లు చేయవలసినది. అంతలో దొందరపడి వచ్చితిమి. నీ బుద్ధియంతయు నప్పుడు మొద్దుపడిపోయినది. ఈ రాత్రి మరల నచ్చటికి బోవుదమా పోయెన నేమి లాభము? ఆ పురుషసింహుం డప్పుడే యింటికి బోయెను గదా? ఉదయమున నేమి చేయుదము. మరల నతండు కనంబడునో లేదో? కటకటా! నేనుదయమువరకు దాళగలనా? ఈ రాత్రి యెట్లైన నతని దీసికొని వత్తువేని బ్రాణములు నిలుచును. లేకున్న బ్రాణములు విడుచుచున్న దానను. విరహవేదన యన నెద్దియో యనుకొంటిని. ఇప్పటికి తెలిసినది. అక్కటా! ఇట్టి యవస్థ శత్రువులకైన రావలదు. హా! పురుషసింహా! యని యనేకప్రకారముల నున్మత్తవలె బలవరింపుచు నుస్సురనుచు నా మంచము మీదబడి కొట్టుకొనుచన్న యాచిన్నదానిం జూచి చతురిక యిట్లనియె.

కాంతిమతీ! నీ వెంతో ధైర్యశాలి వనుకొంటి నంతయు నిప్పుడు తెలిసినది. ప్రథమసమాగమముననే తేలిక పడనేల నని నే నూరకుంటిని. ఒక రాత్రికే తాళలేవా? అట్టిదాన వప్పుడేమిటి కూరకొంటివి ఎదుర నన్ను నిందింపుచున్న దానవే? కానిమ్ము . ఇంత బేలవని తెలియక యశ్రద్ధచేసితిని. ఈ రాత్రి యెట్లో వేగింపుము. ఉదయంబున వానిందెచ్చి నీతల్పంబునం నుంచెదనని చెప్పి శైతోపచారములు చేయ దొడంగినది. కాని యేమియు నుపయోగము లేకపోయినది.

మేన నలందిన చందనమంతయు ధూళియైపోయినది. అవయవములం జుట్టిన బిసతంతువులు పెళుసెక్కి విరికి బోయినవి. తప్తాయన పాత్రంబునం బోసిన జలంబువలె తనువునం జిలికిన పన్నీరంతయు బేరులేక హరించినది. ఈరీతి లోనికాకచే దాజేయు నుపచారము లించుకేనియు బనిచేయకుండుట జూచి యా చతురిక దాని కంతుసంతాపమున కాశ్చర్యమందుచు జిన్ననాటనుండియు నెన్నడేని యిట్టి వికారములు కనివిని యెరుగని యా చిన్నదానికి చిన్నె లెట్లభ్యస్తము లయ్యెనో యని వెఱగందుచు నోపినంతనట్టు నుపశాంతి జేయుచు నెట్టకేల నా రాత్రి దానితోడ వేగించినది.

సూర్యోదయమైనతోడనే యాచతురిక కాంతిమతికి గొన్ని రహస్యములు బోధించి తాను మరల నదృష్టదీపుడున్న యింటికి వచ్చి యచ్చట రహస్యముగా నొక చోట డాగి వారనుకొను మాటలు వినుచుండెను. అదృష్టదీపుడు మిత్రునితో బలభద్రా నేనెంత తెలివిహీనుడనో చూచితివా? హస్తగతప్రాయమైన ఫలము స్వీకరింపక ద్రోసివేసితిని. దైవ మెద్దియేని సంప్రాప్తమగునట్లు చేయునుగాని తినిపించునా! మంచిసమయము మించిపోయినది. సాహసము చేయలేకపోయితిని. అయ్యో! యీ సంతాప మెట్లు వారించుకొందును. మిత్రమా సూర్యోదయమయినట్లున్నది చూడుము. మనము పరుండి యెన్ని రాత్రులైనది. ఒక్క టియే? పెక్కులాగున దోచుచున్నదే యని బహువిధంబుల బలవరింపుచున్న యా రాజపుత్రుని వాక్యములు విని చతురిక మిక్కిలి