పుట:కాశీమజిలీకథలు -02.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అదృష్టదీపుని కథ

173

లన్నియు గానుకగా గోపబాలురకిచ్చి యంపెను. నేపాళదేశపురాజు ఆ వస్తువాహనములు స్వీకరించి మీతో మైత్రి నంగీకరించితినని సగౌరవముగా తిరుగ నుత్తరము వ్రాయుచు నావస్తువులకు నిబ్బడిగా మరల వారిచేతి కిచ్చియేయంపెను. ఆ గోపకులు నట్టివస్తువులన్నియుందెచ్చి యదృష్టదీపున కిచ్చిరి. వాని మొత్తమును అతడప్పుడే యుత్తరముతో విదర్భదేశపు ప్రభువునొద్ద కనుప నావైదర్భుడును సంతసింపుచు దానికి రెండు రెట్లధికముగా మరల నంపెను.

ఈరీతి ప్రతి భూపతికిని బంపుచుండ నదృష్టదీపుని పేరు భూమియంతయు మిగుల విఖ్యాతిగా వ్యాపించినది మరియు వేలకొలది గుఱ్ఱములు, నేనుగులు, లొట్టియలు, రత్నభూషాంబరములు కానుకలుగా వచ్చుచుండుటయు వానిలో గొన్నిటి నమ్మించి దానవచ్చిన విత్తంబు పెట్టి ప్రతిరాజధానిలో నదృష్టదీపునిపేరిట సత్రములు వేయించు చుండెను. క్రమంబున నచ్చటనున్న గోపాలకుల కందరికిని మంచి దుస్తులిప్పించి గుఱ్ఱమును, నేనుగులు నెక్కుపాటవము నేర్పించెను.

ఒక్కొక్క రాజు నొద్దనుండి వచ్చిన కానుకలు లక్షలకొలది నుండుటచే వానిలో సగము సగముగా విభజించి యిరువురు రాజులకు బంపుచుండెను. మఱియు నాయారాజధానులలో బర్వదినములయందు దానధర్మములక్రింద గొంతసొమ్ము వ్యయపరచుచుండెను జగంబంతయు నదృష్టదీపుని పేరు వ్యాపించినది. కాని యతం డెచ్చటనుండునో మాత్రమెవ్వరికిని దెలియదు. అతడు కానుకలుగా వచ్చు ధనము వెంటనే వినియోగము చేయుటగాని మరియొక రాజుగారికి బంపుటగాని చేయును. దానిలో గాసైనను ముట్టలేదు. యథాప్రకార ముదయమున బశువుల వెనుక నడవికి వచ్చి యచ్చట పిల్లలతో నామర్రిచెట్టుక్రింద దారు పీఠమున గూర్చుని యావేడుక రాజ్యము సేయుచుండెను.

ఈరీతి రెండుమూడు సంవత్సరములు జరుగువరకు పుడమిలోనున్న రాజు లందరు మిత్రులయిరి. ప్రతిసంస్థానములో నతనిపేరే చెప్పుకొనదొడంగిరి. పెక్కేల! ప్రజలు వాడుకమాటలతో గూడ కన్యలం జూచినప్పు డదృష్టదీపునంతవానిం బెండ్లియాడుదువులే యనియు వీడదృష్టదీపునివలె వచ్చుచున్నవాడనియు నతండటుల గర్వపడుట కదృష్టదీపుడా యేమి యనియు నీరీతి నతని ప్రస్తావన దెచ్చుచుందురు. ఒకనాడు పుడమిగల మహారాజులందరు విశ్వేశ్వరమహాదేవుని మహాపూజామహోత్సవమునకు గాశికివచ్చిరి. అప్పుడందరును గలసి మాటలాడుకొనుటలో ప్రతిరాజును నదృష్టదీపుడు తనకు మిత్రుడనియు నతని పరిచయము తమకు నెక్కుడుగా నున్నదనియు చెప్పదొడంగెను. ఆ యుత్సవమునకు నదృష్టదీపుడు గాశికి వచ్చునేమోయని యనేకులు జూడవచ్చిరి. కాని యతనికాడ యేమియు గనంబడినదికాదు.

కాశీలో నదృష్టదీపుని సత్రములు నాలుగు గలవు. ఒక్కొక్క మారే లక్షల కొలది ధనమిచ్చియున్నవాడు కావున దాని వడ్డివలననే రాత్రింబగళ్ళు నిరభ్యంతరముగా