పుట:కాశీమజిలీకథలు -02.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

172

కాశీమజిలీకథలు - రెండవభాగము

గము లిచ్చుచు బనుల జెప్పుచు ధర్మములం బలుకుచు జట్టముల రచించుచు నిజమైన రాజువలె రాజ్యము చేయుచుండెను. ఈరీతి బ్రతిదినము నుదయమున వచ్చి సాయంకాలమువరకు నాడుకొనుచు రాత్రికింటికి బోపువారు. తమ పెద్దలెప్పుడైన నడవివస్తువులం దీసికొని పట్టణప్రాంతములకుబోయినప్పుడు ఆపిల్లలు వ్రాసుకొనుటకు గాగితములును గలములందెచ్చి యిచ్చువారు కావున నవి యన్నియు నదృష్టదీపుడు తన రాజ్యాధికారమునకుగాను వినియోగము చేయుచుండెను.

అది మిక్కిలి భయంకరమైన యరణ్యమగుటచే నచ్చటికి నెన్నడును నితరమనుష్యులు వచ్చువారుకారు. అచ్చటికి మిక్కిలి దూరములోగాని దాపున పట్టణముగాని గ్రామముగాని లేదు. ఇట్లుండగా నొకనాడు సింధుదేశపురాజు వేటవేడుకచే నయ్యడవికివచ్చి యచ్చోట శిబిరములు వేయించి రెండుమూడు దినములుండి వేటాడెను. ఆ వార్త నదృష్టదీపుడు బాలురచే దెలిసికొని వెదురుబియ్యము, తేనె, ముత్తియములు, చారపప్పు, చామరములు మొదలగువస్తువులు సంగ్రహించి యవియన్నియు మూట గట్టించి విజ్ఞాపనపత్రికాపూర్వకముగా నొక గోపబాలునిజేతికిచ్చి యంపెను

ఆయుత్తరము జదువుకొనిన నిట్లున్నది. మహారాజు సింధుదేశ రాజుగారికి నమరావతీచక్రవర్తి యదృష్టదీపమహారాజు చేయు విజ్ఞాపనము. తాము మా యడవికి వచ్చుటచే మిక్కిలి సంతోషమైనది. ప్రస్తుతము వచ్చి మీదర్శనముచేయుటకు నవకాశము చిక్కినదికాదు. మేము మీ మైత్రినిగోరి మాజ్ఞాపకార్థ మీయడవివస్తువుల బంపితిమి. మీరు మాకీ యడవిలో వసించినందుల కీయవలసినపన్ను స్వీకరింపుము. సర్వదా తలంచుచుండవలయును. ఇవియే పదివేల విజ్ఞాపనములు.

- అమరావతీచక్రవర్తి, అదృష్టదీప మహారాజు.

అనియున్న యుత్తరమును జదువుకొని నిజముగా నట్టిచక్రవర్తి యున్నాడు కాబోవుననుకొని చక్రవర్తిశబ్దమునుబట్టి తనకంటె నతడే యధికుడని తలంచుచు దన కాయనజేసినమర్యాదకు మిక్కిలి సంతసించి యాకానుకల స్వీకరించి మరల నొక యేనుగయు రెండులొట్టియలు నాలుగు గుఱ్ఱములు మణిఖచితమగు నొకపతకమును గొన్ని చీనాంబరములు లెక్కించి మీరు వ్రాయించినయుత్తరమును బంపించిన కానుకలు నందినవి. మిక్కిలి సంతోషించి యావస్తువులు మీజ్ఞాపకార్థము సంతతము, దాపున నుంచుకొనియెదను. మమ్ముగూడ మీరు మరువగూడదు తిరిగి యీ వస్తువుల నంపితిమి మన్నింప వలయు సర్వదా వార్తల దెలుపుచుండవలయునని వ్రాసి యావస్తువులతో నుత్తరమిచ్చి తమభటుల నా గొల్లపిల్ల వానివెంట నంపెను.

అదృష్టదీపు డట్టియుత్తరముతో నాకానుకను నందుకొని సంతోషించుచు నంతకుబూర్వమే పెక్కెండ్ర రాజుల పేరులు వినియున్న వాడు కావున నప్పుడే నేపాళ దేశపురాజు పేర నారీతినే యుత్తరము వ్రాసి సింధుభూపతియిచ్చిన వస్తువాహనము