పుట:కాశీమజిలీకథలు -02.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అదృష్టదీపుని కథ

171

నికిఁ బదియేడుల ప్రాయమువచ్చినప్పుడు బాలురతోఁగూడ నడవికిబోయి యొకనాఁ డాత్మగతంబున నిట్లు తలంచెను.

ఆహా! మాయవ్వ చెప్పుచుండెడి కథలనుఁ బట్టిచూడ నీభూమియం దనేకవిచిత్రములగు పట్టణములను గ్రామములు రాజులు సేనలు రథములు, గుఱ్ఱములు మొదలగునవి యెన్నియేనిఁ గలిగి యున్నట్లు తోఁచుచున్నది. ఈ యడవిలోనేమియుఁ గనంబడవు భూమిలో నొకఁడు సేవకుఁడు నొకడు సేవ్యుండుగా నుండుటకుఁ గారణ మేది? మనుష్యజాతి యంతయు నొక్కటియేగదా! అది వీరివీరి బుద్ధిబలమునుఁబట్టి వచ్చి యుండవచ్చును. మా పల్లెలోని వారిచర్యలన్నియు నేను జూచుచుంటిని. ఒక్కనికైన బుద్ధిబలమున్నట్లు తోఁచదు. వారి యాకారములును వికృతముగా నున్నవి. నేనట్టి వారికిఁ బుట్టియు నట్టిరూపము బూనక వేఱొకరీతి నుండుటకుఁ గారణమేదియో యుండవచ్చును. ఈ పల్లెలోనున్న వారిలో నొక్కనికై నను నా పోలికలేదు. ఇప్పుడు నా బుద్ధిబలముచేత నీయూరంతయు నాయధికారమునకు లోఁబడునట్లు చేసికొనియెద నని తలంచుచు నచ్చటనున్న బాలుర నందరంజీరి యిట్లనియె.

బాలకులారా! మనమీయడవిలో నూరక తిరుగుచుండనేల! నే నొకయుపాయము జెప్పెదను. నేను జెప్పినప్రకారము మీరందరు వినియెదరా యని యడిగిన వాండ్రెల్ల నొడంబడిన పిమ్మట మరల నిట్లనియె. ఈభూమిని పాలించెడు రాజునకొక మంత్రియు భటులు గలిగి యుందురు. ఆరాజు క్రమప్రకారము ప్రజలపాలించుచుండును గదా అలాగుననే మనముగూడ బాలించుకొందము. నేనురాజును, మీరు మంత్రులు, వీరు పరిచారకులు, వీరు ప్రజలు ఈరీతి నిర్ణయించిన యీయడవిలో నాడుకొందము. ఈయాట మిగుల విచిత్రముగా నుండునని పలికిన నందరు వానిమాటకు సంతసించిరి.

అప్పుడు వారందరిచేత నొక విశాలమగు మర్రిచెట్టుక్రింద జక్కగా బాగు చేయించి యడవికర్రలచే నెత్తుగా నొక మంచె సింహాసనములాగున గట్టించెను. దాని చుట్టును మంత్రులకును సామంతులకును లేఖకులకును దగినట్లు దారువులతోనే బీఠముల గట్టించెను. చుట్టును ఆవరణము , ద్వారము, ద్వారపాలురు మొదలైనరాజసభాలక్షణము లన్నియు గలుగునట్లు మ్రానులతో గట్టించెను. ఆబాలకులలో గొందర మంత్రులగాను మరికొందర లేఖకులగాను గొందర బ్రజలగాను వారి వారి బుద్ధిబలమునకు దగినట్లు నిర్ణయించి తాను రాజుగా నాసింహాసనమునగూర్చుండి వారువారు చెప్పదగినమాటలన్నియు నుపదేశించుచు నదృష్టదీపు డయ్యడవిలో రాజ్యము సేయుచుండెను.

నిజముగా రాజునకు బ్రజలు జడిసినట్లా బాలకులందరు వానికి జడియుచుందురు. తానురాజుగా నుండి యాపరిచారకులలోనే పశువులు గాచుటకు దినమునకొక్కనికి వంతువేయుచుండును. దానంజేసి తక్కిన బాలుర కందరకును దీరుబడిగా నుండునది. మరియు నేరములు నిరూపించుచు శిక్షల విధించుచు దీరుపులు వ్రాయుచు నుద్యో