పుట:కాశీమజిలీకథలు -02.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంద్రుని కథ

149

లేనప్పుడీసభ కెవ్వరైన వచ్చిరేమో యథార్ధము చెప్పుము లేకున్న నిజము తెలిసికొని నిన్ను శిక్షింతునని యుగ్రముగా బలుకగా వాడు రహస్యము నిలుపలేక వెఱచుచు స్వామీ! నన్ను రక్షింపుడు నిక్కము చెప్పెదను. నేను కొంచెము మయిమరచి యున్నప్పు డెవ్వరో గుప్తమార్గమున లోనికిబోయియుందురు. ఆ ద్వారము తెరవబడి యున్నది. కారణము తెలిసినదికాదు. మరియు దిలోత్తమ మొన్నను లోననుండి గుప్త మార్గమునవచ్చినది. ఇంతకన్న నాకేమియు దెలియదని చెప్పెను.

ఆ మాటలు వినినతోడనే యింద్రుడు మరియు వెఱగందుచు నోహో! యిది మిక్కిలి చిత్రముగానున్నది. తిలోత్తమ రక్కసునిచే జిక్కి యెక్కడికోపోయి యుండగా మనసభలో బ్రచ్ఛన్నమార్గమున నెట్లువచ్చినది. నీమాటయేమియు దార్కాణముగాలేదని పలుకుచు నందలి నిక్కు వమరయ నాకుసందేశముపంపెను నేను వెఱపుతో నాపురుహూతునొద్దకుంబోయితిని. అతండు నన్నుజూచి నందుడుజెప్పిన మాట లన్నియుంజెప్పి మొన్నను నీవు గుప్తమార్గమున సుధర్మనుండి వచ్చితివాయని యడిగెను. అయ్యో! మీరు నన్నట్లడుగుట కాశ్చర్యముగానున్నది. రక్కసునిచేజిక్కి మిక్కిలి యిక్కట్టుజెందియున్న నేనెట్లీ సభకువత్తును. వీనిమాట మీరెట్లు నమ్మితిరి. ఇదియేమియు నే నెఱుగనని చెప్పితిని.

పిమ్మట నావృత్రారి యాచార్యుని మొగమును జూచుచు నిది యేమి చిత్రము. నందునిమాటలు పాటింప దగినట్లు తోచవు. తాను బోవువరకు గుప్త ద్వారము తెరచియున్న దనుమాట యెంత నిక్కువమో విచారింపవలయును. ఈ యుత్తర మెట్లువచ్చినదని యడిగిన దిలోత్తమ వచ్చినట్లు చెప్పుచున్నవాడు తిలోత్తమకును నీయుత్తర మందున్న రుచికునికిని సంబంధమేమి. దీనికెద్దియో కారణముండ వచ్చును. గురువర్యా! ఇందలిసత్యము తెలియుట మనకు మిక్కి లి యావశ్యకమై యున్నది. ముందు నీవా రుచికుడను వాడిప్పు డెచ్చట నున్న వాడో చెప్పుము. వాని నిందు రప్పించిన నంతయును దెలియనగునని యడుగగా నతండు జ్యోతిష సిద్ధాంతశాస్త్రమునుబట్టి లగ్నమునుగట్టి చూచి నీవున్నచోటు నిక్కముగా జెప్పెను. తరువాత నిన్ను దీసికొనివచ్చునట్లు దేవదూతల కాజ్ఞయిచ్చెను. వారు నీకొరకు వెళ్ళినతరువాత బురుహూతుడు మరియు నందుని దర్కించి యడిగినవాడు అయ్యా! నామాట దబ్బర కాదు. తిలోత్తమ లోపలినుండి వచ్చినది. లోపలి కెప్పుడు వోయితివని యడుగగా నన్ను లోపలబెట్టి యరయక తలుపువైచితివని యెద్దియో గొడవ బెట్టినది ఇదియంతయు దాని నిర్బంధించి యడిగినం దేటబడును దీనినప్పుడు చూచినవా డొక్కడుగలడు వానిచేత సాక్ష్యమిప్పించెదనని చెప్పగా మంచిదని యొప్పుకొని యింద్రుడు వాని నప్పుడే రప్పించి యడుగగా వాడిట్లనియె దేవా! గుప్తద్వారము దాపున నందుడును