పుట:కాశీమజిలీకథలు -02.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

కాశీమజిలీకథలు - రెండవభాగము

నందుడు - అట్లయినం ద్వరగారమ్ము. పీఠములన్నియు జక్కగా సవరింతము.

అని యీరీతి నొండొరులు సంభాషించుకొనుచు వచ్చి యాపెద్దగుమ్మము తలుపులు తెఱచిరి. అప్పుడు నేనును దిలోత్తమయును నాపెట్టెమాటున నణగి యుంటిమి. మఱియు నేను భయపడి తిలోత్తమతో మన మవ్వలకు బోవలదా? అని పలికినంత నానోరు మూయుచు మాట్లాడవలదని సంజ్ఞచేయుచు నన్ను బట్టుకొనినది. అంతట భేరీధ్వనులు వినబడినవి. ఆ ధ్వనుల వలన నాగుండెయలు పలిగినవి. పిమ్మట మేళములతో జయజయధ్వను లేపార వాసవు డాసభాభవనమునకు విచ్చేసెను. మే మెవరికి గనంబడుటలేదు. కాని అందరును మాకు గనంబడుచుండిరి. అది రహస్యస్థలమని యెఱుగును. కావున దిలోత్తమ నిర్భయముగా నుండుమని నాకు బోధింపదొడంగినది.

ఇంద్రుని కథ

పిమ్మట నింద్రుడు తన సింహాసన మలంకరించిన తరువాత దేవతలు, మునులు వారివారిప్రదేశమ్ములం గూర్చుండిరి. అప్పుడు బృహస్పతి లేచి యా రక్కసునివరవిశేషము లుగ్గడింపుచు జయంతుని పరాక్రమమునుగురించి కొంతసే పుపన్యసించెను. అచ్చట నున్నవారందరు తమకు దోచిన ప్రకారము క్రమముగా నుపన్యాసము లిచ్చిరి. పిమ్మట రంభాదుల నాట్యవినోదము జరిగినది. అట్లు కొంతసేపు దేవేంద్రుడు సభజేసి తన విజయమును గురించి నుతియించుచు దేవతలకు గానుక లిచ్చి వారి వారి నివాసముల కనిపి తానును వైజయంతమునకు పోయెను. పిమ్మట నా సభాద్వారము మూయలేదు. అచ్చట ద్వారపాలకులు విచ్చుకత్తులతో గాచుకొని యుండిరి. మాకా దారినిబోవుటకు వీలులేకపోయినది.

అప్పుడు తిలోత్తమ పెక్కు తెరంగుల నంతరంగమునం దలపోయుచు ప్రతీహారులకు గనబడకుండ నాగుప్తద్వారము దాపునకు నాతోగూడ బోయినది. అంతకుమున్న మేము వచ్చిన ద్వారమును విజయునందు ననుమానపడి బిగించి లోపల బీగమువైచిరి. దానింజూచి తిలోత్తమ గుండెమీద జేయి వైచుకొని అమ్మో! ఇక మనకు బ్రదుకులేదు ఈ ద్వారమునకు దాళము వైచిరి. మరియొకదారిని బోవుట శక్యము గాదు. ఇంద్రుని యానతిలేక పెద్దగుమ్మమున జీమకయినను రాకపోకలు గలుగుట