పుట:కాశీమజిలీకథలు -02.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భక్తురాలి కథ

129

పొండు. మీ నిమిత్తము కొంచె మాలస్యమైననుఁ బ్రవహణము నిలుపునట్లు చేసెదను. బ్రాహ్మణుల కీపాటియుపకారము చేయుట యబ్బురము కాదని యేమేమో చెప్పి తన గృహము జూపుటకై యొకభటుని నతనివెంట నంపి తరువాత భక్తురాలిం జూచి అమ్మా! నీవృత్తాంతము వినినచో నెట్టివారికిని జాలి వొడమకనదు. నీవు రాచబిడ్డవై యిట్టి నీచవృత్తిమైనవర్తించుట న్యాయముకాదు. మీతండ్రికి నుత్తరమువ్రాసి నిన్ను మీ దేశమున కనిపెదను. అంతదనుక మాయింటనంతఃపుర స్త్రీలలోఁ గలిసియుందువుగాని రమ్మని యుక్తియుక్తముగా బోధించి యొప్పించెను.

అప్పుడా మంత్రి యింటికిబోయి భక్తురాలిం దీసికొనిరమ్మని యొకపరిచారికనుఁ బంపెను. భక్తురాలు మంత్రి తన్ను జేసిన అపూర్వ గౌరవమునకు మిక్కిలి సంతసింపుచు నందలమెక్కి వారిసౌధమునకుఁ బోయినది ఆలోపల జంద్రలేఖ పురుషవేషమును తీసి మునుపటివేషముతో నొక అంతఃపురమున నుండి యాభక్తురాలి నచ్చటికి రప్పించుకొనియెను. అప్పుడు చంద్రలేఖంజూచి భక్తురాలు ఓహో! యీమె మంత్రిభార్య కావలయును. చంద్రలేఖ పోలిక అగుపడుచున్న దేమి? అక్కలికి యిక్కడికేమిటికి వచ్చును? ఒకవేళ నన్ను వెదకుచు వచ్చినదా! అని పెక్కుగతులఁ దలంచుచు నిలువంబడియున్న భక్తురాలింజూచి చంద్రలేఖ సంతోషము పట్టజాలక ప్రాణసఖీ! నన్ను మరచిపోయితివా? పల్కరించవేమియని యట్టెలేచి యా చెల్వం గౌఁగలించుకొనినది.

తిలోత్తమయుఁ దత్కాలోచితమైన వచనములచేఁ జంద్రలేఖకు శోకమిబ్బడింపఁ జేసినది. ఇరువురు కొంతసేపు చిరకాలవియోగశోకం బభినయించుచు నొండురుల వృత్తాంత మెరింగించి యాశ్చర్యమందఁ జొచ్చిరి. చంద్రలేఖ తిలోత్తమకుం దన వృత్తాంతమంతయుంజెప్పి సఖీ! మనకిప్పుడు కాలము మంచిదైనది. విను మల్లఁనాడు నీ మేడకువచ్చిన దివ్యపురుషుం డిక్కడికివచ్చెను. వాని నీ కిప్పుడు చూపెద సరయుము. వాని వృత్తాంతము కొంత నే నెరిఁగియుండియుఁ జెప్పితిని కాను. అతనిచేత నంతయుం జెప్పించెదనని పలుకుచుండఁగనే యా విదేశపురుషు లిరువురువచ్చి ద్వారమున నిలిచి యున్నారని యొక యాంతరంగికసఖురాలు వచ్చి చెప్పినది. వారి నాలోపలకే తీసికొనిరమ్మని దానినే యంపినది. అదివోయి ముహూర్తమాత్రములో వారిరువురును లోపల బ్రవేశింపఁజేసినది. అప్పుడు గౌతముఁడును రుచికుఁడును నందు బురుషులెవ్వరును లేక స్త్రీలు మాత్రమే యుండుట దూరమునందు చూచి దారితప్పితిమని వెరచుచు దిరిగి వెనుకకుబోవఁ బ్రయత్నింపుచున్నంతఁ జంద్రలేఖ సఖురాలు అయ్యా! పోకుఁడు పోకుఁడు వారే మి మ్మీలోపలకుఁ దీసికొనిరమ్మనిరని చెప్పినది.

ఆ మాటవిని వారు సంశయాకులితహృదయులై యల్లన నప్పల్లవపాణులున్న