పుట:కాశీమజిలీకథలు -01.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వసంతుని కథ

79

అప్పుడు తల రుద్దుటమాని కన్నులం గడిగినం జూచి యాచకోరాక్షి నలుదెసలం బరికించి యెందును భూమిం గానక పెద్దయోడ గాంచి యాముసలిదాని కపటం బెఱింగి యిట్లనియె. ఓసీ పాపాత్మురాలా! నామగ డచ్చట గతచేతనుడై పడియుండ న న్నిక్కడి కేల తోడ్కొని వచ్చితివి. నీ యభిలాష యెద్దియో చెప్పు మూరక యేల శ్రమపెట్టెదవు. నన్ను గూడ జంపినం జంపుము. నీ కపట మెఱుంగక బంగారమువంటి కాపురము నీటగలుపుకొంటినే!

అయ్యో! యెంత కపటము బన్నితివి. కటకటా మన్మథునిబోలు నా మగని నిరపరాధిం జంప నీకు జేతులెట్లాడెను? చీ! కఠినచిత్తురాలా! నీ మొగము జూచిన బాతకమువచ్చునే. ఇదిగో నీవు జంపకున్నను ప్రాణేశ్వరుంబాసి నిముషమైనను దాళ జాల. ఈ సముద్రోదకంబులంపడి లోకాంతరమున నతని గలిసికొనియెద నని లేవ బోవుటయు నట్టెపట్టుకొని లేవనీయక యది యోడవాండ్రం జీరి దీని లోనికి గొంపొండు డని యాజ్ఞాపించిన వారు బలాత్కారముగా నానారీమణిని నోడలోనికి దీసికొనిపోయి రమ్యమైన యొకగదిలో బెట్టి తలుపు బిగించిరి.

పిమ్మట నా ముసలిదియు నోడయెక్కి సరదారులకు బడవ నడుపుడని యాజ్ఞాపించి తానుగూడ నాయువతియున్న గదిలోని కరిగి మగనిం దలంచి నొగిలిన చిత్తముతో నుత్తలపడుచున్న యప్పడుచుతో నిట్లనియె.

కాంతా! నీ కాంతుడు లోకాంతరమున కరిగెను . చింతించిన మరల వచ్చునా? విను మతనికన్న భాగ్యంబునను, రూపంబునను యౌవనంబునను నధికుడైన వాని నీకు బతింగావింతు. పదిదినములు సైరింపుమని యెన్నియో ప్రియోక్తులు చెప్పినది గాని యవి యన్నియు బెడచెవులంబెట్టి పట్టరాని యలుక దాని బెక్కుగతుల దిట్టుచు వైనంబును దూరుచు దనకుదాను నిందించుకొనుచు బెక్కుగతుల వగచుచుండెను.

ఆ నావయు మంచిగాలి వీచుటచే నారుదినములకే వంగదేశపు రేవు చేరనది. తోడనే ముసలిది పిరంగియొకటి వేయించిన నా ధ్వనివలననే కార్యసూచనము దెలిసికొని యా భూపాలుండు చితపరివారంతో నా యోడజేరి ముసలిదాని వలన నన్నెలంత వృత్తాంతమంతయు విని సంతసించి యా చెల్వుంజూచి మూర్చిల్లి యొక్కింతవడికి దెలిసి మోహమాపలేక యప్పుడ యప్పడంతింగూడ దలంచెను. అమ్ముసలిది యొప్పుకొనక కొన్నిదినములు మచ్చిక జేసినగాని యిచ్చగింపదని యడ్డుపెట్టిన నతండు సమ్మతించి యొకయాందోళికమున నబ్బాలికామణిం గూర్చుండబెట్టి తలుపులు బిగించి యపూర్వమగు నొకయంతఃపురమున జేర్చెను.

అందు దగిన పరిచారికల బెక్కండ్ర నునిచి యవ్వనిత మనసు నచ్చిన యుపచారముల జేయించుచు నొక్కనా డంగజతాపతప్తుండయి యతం డచ్చేడియ గవయం