పుట:కాశీమజిలీకథలు -01.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవతావస్త్రముల కథ

53

యుచితపీఠికం గూర్చుండంబెట్టి స్వాగతపూర్వకముగా నాగమనకారణములు దెలిసికొని ముం దతనిచేయిం బట్టుకొని యామగ్గములదగ్గరకుఁ దీసికొనిపోయి అయ్యా! మగ్గ మదిగో చూడుడు. రెండు మూడు దినములలో బద్దలం దగిలించి నేత ప్రారంభము చేయుదుము. ఈ వింతనూలు చూచితిరా? యిది కట్టుచాపునకును యిది తల రుమాలునకును యిది చీరకునుగా నేర్పరచితిమి. నిదానించి పరీక్షించుఁడు. మార్దవాదిగుణంబులు గ్రామాధికారులు చూచినప్పటికన్న సొంపుగా నున్నవి. అప్పుడు సిద్ధమగుచుండుటంబట్టి యిట్టి యందము తేలలేదు. నేతఁ బట్టిచూడుఁ డెంత మృదువో యని వట్టిమగ్గముమీదఁ జేయి నంటించిన నాసేనాని తన కేమియుఁ గాన్పించక మనంబున దిగులుపడి అయ్యో! నా తల్లి గ్రామాధికారుల జననివంటి గుణసంపత్తి కాకపోయెనే? కటకటా! యట్టి కులటకు జనించిన నా పరువేపాటియది సాటివారిలో మేటి యనుకొంటి గాని దీనిమూలముగాఁ దేటయైనది.

ఈ గుట్టు బయట పెట్టినచో చుట్టములు సైతము మొట్టమొదట చూచినంత గౌరవముగాఁ జూడరు ఊరక యట్టి యపకీర్తి వెల్లడి చేసికొననేల! చాలునని తలంచి యామగ్గములోఁ గూర్చిన నూలు ముట్టిన ట్లభినయించుచు నోహో! యీనూలు మార్దవము మిగుల విన్నాణముగా నున్నది! గ్రామాధికారులు దీని గుణమంతయు జెప్పలేకపోయిరి. ఈ నూలు మనుజులు చేతితోఁ జేసినదే? ఔరా! యంత్రమునైన నింత వింతగాఁ దీయుట దుర్ఘటము. ఇట్టి నూలునేసిన పుట్టంబులఁ గట్ట మా రాజుగా రెంత పుణ్యముఁ జేసిరో? యిట్టి విద్యాపాటవ మభ్యసించిన మీకు భగవంతుఁడు చిరాయు వొసంగెడుగాక యని యా వలువల శ్లాఘించుచుఁ బ్రయాణోన్ముఖుండై యున్న సేనానితో రాముఁ డిట్లనియె.

అయ్యా! మీ యేలికతోఁ జేలంబులనేత యెల్లుండి ప్రారంభింతుమని చెప్పుఁడు. తక్కిన గుణంబులు మీరు చూచినవేగదా. మీకు దోఁచినట్లు వక్కాణింపుఁడని యతని వీథిద్వారముదనుక సాగనంపి క్రమ్మర లోనికరిగి యా మగ్గంబు లొకమూలఁ బాఱవైచి యథాప్రకారము వినోదములతోఁ బ్రొద్దుపుచ్చుచుండిరి.

లోన రవులుచున్న మాతృదోషవిచారపరితాపము మొగమునం దోపనీయక దండనాథుఁడు సంతసించువానివలెనే రాజునగరి కరిగి తనరాక కెదురుచూచు నృపతికి మ్రొక్కి యావసనంబుల గురించి గ్రామాధికారులకన్న నధికముగా స్తుతిజేయుచుఁ జెప్పి తదనుమతి నింటి కరిగి యాచింత స్వాంతమునఁ దగిలి చివుకుచుండెను.

ఆభూపతి సేనాపతి మాటలు వినినది మొదలు రెట్టించిన వేడుకతో నెట్లో యొకనెల గడిపి యొకనాఁడు మంత్రిం జీరి దుర్బుద్ధీ! యీపాటికి మన పుట్టములనేత పూర్తియగును. నేతరీతి యెటులున్నదో నీవే వెళ్ళి స్వయముగా చూచివచ్చి నాతోఁ