పుట:కాశీమజిలీకథలు -01.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శివశర్మ యను బ్రాహ్మణుని కథ

19

వటుకభైరవాదుల యాత్రావిధిం భజించి మఱియు గాశీఖండంబున జెప్పంబడిన శివమూర్తులను తీర్థవిశేషంబులను వెదకి వెదకి వాని నామంబుల నచ్చటివారి కెఱుంగదెల్పుచు నధికనియమంబుమీద నారుమాసంబు లాపురంబున నుండి యమ్మహాదేవు నర్చించెను. పిమ్మట దక్కంగల తీర్థముఖ్యముల సేవించదలంచి యందు వెడలి ప్రయాగ కరిగె. అదియు నెంతధన్యాత్మునైనను రెండుమూడువాసరంబులకన్న నెక్కువ నుండనీయదు. కావున మూడుదినంబు లందలితీర్థదేవతల యథావిధి నారాధించి మరియుం గయయు, గాంచీపురంబు, నుజ్జయినియు, మథురయు ద్వారవతియు, నయోధ్యయు మొదలగు క్షేత్రంబుల కఱిగి యందలి హరిహరుల సమబుద్ధి నారాధించి మాయాపురంబున కఱిగెను.

అదియు హరిద్వారం బనియు, ముక్తిద్వారం బనియుఁ బేర్కొనబడుచుండు. అ ట్లఱిగి శివశర్మ నిర్మలబుద్ధిఁ దీర్ఘోపవాసంబు చేసి యథోక్తరీతి నాతీర్థదేవతల దృప్తిపరచి యందుఁగల చంద్రశేఖరుని పంచాక్షరీమంత్రపారాయణపరుండై మూఁడువాసరంబు లర్పించెను.

అట్లుండ నంత నొకనాఁడు హరిద్వారప్రాంతగంగాతీరంబున మధ్యాహ్నమం దన్నము పచించి పాత్రతో వడ్డించుకొనఁ దలచునంతలో నితాంతమరణవేదన యావిర్భవించి జీవితమారుతముల కెడయయ్యెను.

అట్లు శివశర్మ గంగాతీరంబున జీర్ణదేహంబు విడిచినంతలోఁ దనకన్నులారం గనిన సంగతులన్నియు బహువినోదములుగాను నద్భుతములుగా నుండుటం జేసి యది తనకు భూలోకనివాసంబున కంతరాయంబైన మరణంబుగా నెఱుంగక తా నొకచక్కదేశంబున కేగుచున్నట్లు తలంచెను.

ముందు నద్భుతంబగు తేజఃపటల మొండు తనచెంతకు వచ్చుచున్నట్లు కాన్పించె. అదియు గొంత నిదానించి చూచినకొలఁది నవరత్నఖచితమైనబంగారపుతళ్కుగా నేర్పడియె. అదియు సమీపించినకొలఁది నొకవిమానంబుగాఁ దోచె. అట్టి విమానరత్నంబు దనచెంత నిలిచినం గని యది యొకభాగ్యవంతుని యానసాధన మనుకొని దాని నధిరోహించువేడుక మనంబున నంతరించునంతలో నందుండి యిరువురు పరిచారకులు దిగివచ్చిరి.

వారిం జూచి యతండు వీ రెవ్వనికై వచ్చిరో యెవ్వనివారలో కదా యని వెరగందుచుండ నక్కింకరులును దివ్యభూషణాంబరములఁ గైకొని తిన్నగా నతనిదగ్గరకు వచ్చి శివశర్మా! వీని ధరింపు మనుటయు నాతం డదివరకు దన జీవితకాలములో నంతవిలువగల నగలను బట్టలను జూచియెఱుంగమి మరియు నద్భుత మంది యోహో