పుట:కాశీమజిలీకథలు -01.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మణిసిద్ధుని కథ

9

అట్లు సాయంకాలమునకు శరీరంబులు జేరవైచి వంటజేసికొనుటకుఁ జెంత సామగ్రలేమిం జేసి చింతించుచుఁ దమబడిన బన్నముల నప్పౌరుల కెఱిగించి పాత్రాదికముల సంగ్రహించి యర్ధరాత్రంబున కెట్లో భుజించిరి.

వారిలోఁ గొందరికి నతిసారరోగ మంకురించుటను నమ్మరునాఁడు పయనము సాగించుటకు వీలుపడినదికాదు. అవ్వీటఁగల సత్రంబున రోగావిష్టుల నిలువనీయరు. వారి యామయ మెఱింగి కావలివారలు వారి నందు వెడలగొట్టిరి.

అప్పుడా రోగులఁ దీసికొనిపోయి తోడివా రూరిబయలనున్న మశీదుపైఁ బరుండఁబెట్టిరి. తురక లత్తెర గరసి యతిరయంబున నరుదెంచి పరుసంబులాడుచు రోగుల నడివీధికి నీడ్చి తోడివారలఁ జావమోదిరి. తన్మలమిళితపవనంబులఁ దటాకంబునఁ నుదుకుటచే వారిలో గొంద రధికారనికటంబునకుఁ దీసికొనిపోఁబడి శిక్షతులైరి. అక్కటా! ఆయిక్కట్టు రోగులకన్న తోడివారికే యెక్కుడుబాధ కలగఁజేసినది. పదిదినము లయ్యూర వసించిరి. వారు పడిన యిడుములకు మేరలేదుగదా! రోగులకు గొంచెముఁ జవసత్వములు గలిగినతోడనే క్రమ్మరఁ గాశికి బయనము సాగింతమని కోరిన సహవాసులకు మత్పితామహుం డిట్లనియె.

సీ! కాశి రాకాశి యని యెఱిగియే బుద్ధిమాలి పయనమైతిమి. యీ సిగ్గు చాలదా జ్ఞానముగలవారి కింటికడ మోక్షము రాదా? జ్ఞానము లేనివారలు నీటికాకులవలె మునింగినను ప్రయోజన మేమి? ఇంటికి బోవుదము రండు. ఈపాటి శిక్ష చాలును. అపరాధులవలెఁ జెరసాలఁ బడితిమి. యందులచే దెబ్బలందింటిమి. బ్రాహ్మణుల మయ్యుఁ గడజాతివారిచే నీడ్పింపఁబడితిమి. అయ్యో! ఆ వెతలు తలంచికొనిన గుండె పగిలిపోవుచున్నది. దేవతార్చన జేసికొనుచు నింటికి వచ్చిన యభ్యాగతుల నర్చించుచు సత్కాలక్షేపము జేయుగృహస్థునికిఁ దీర్థయాత్రతోఁ బ్రయోజన మేమి? బ్రతికియుండినఁ బెక్కుమార్గములఁ బుణ్యము సంపాదించుకొనవచ్చును. మరల యింటికి బోవుదము రండని బోధించినఁ గొందఱు సమ్మతించిరి. మఱికొంద ఱతనిమాట బాటింపక వారిని విడిచి యవిముక్తక్షేత్రంబున కఱిగిరి.

మత్పితామహప్రభృతు లారుమాసముల కిల్లు జేరి మఱిమూఁడునెలలకుఁ బూర్వజవసత్వములు గలిగి తిరుగుఁజొచ్చిరి. కాశికిం బోయిన పదుగురిలో నెనమండ్రు దారిలోనే కడతేరిరి. ఇరువు రప్పురవరంబు జేరిరఁట. కొంతకాల మందుండి వారింటికి వచ్చుచుండ మార్గమధ్యంబున కాలధర్మంబు నొందినట్లు చిరకాలమునకుఁ దెలిసినదని