పుట:కాశీమజిలీకథలు-12.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

98

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

మిరువురమును దలయొక దిక్కునకు బోతిమి. నేను తూర్పుదిక్కుగా బోయి నాలుగు దివసంబు లహోరాత్రంబులు వానికొరకు వెదకి వెదకి యెచ్చటను వాని జాడ నెరుం గక మొదట జేసికొన్న నియమము వడువున నరిందముని గలసికొనుటకు దిరుగ భైరవీదేవి యాలయము నొద్దకు వచ్చితిని. అరిందము డక్కడ నాకు గనుపింపలేదు. అందులకు నేను సంశయించుచుండగా మణిగ్రీవుడు విమానమెక్కి యాచక్కి కేతెం చెను. నన్ను జూచి యతండు దిన్నగా నేనున్న చోటికి వచ్చెను. వెనుక హిమశైలా రణ్యమందు గుంభునితో ద్వంద్వయుద్ధ మొనర్చునప్పుడు నన్నాతడు జూచియుండు టచే గుర్తుపట్టి మిగుల నమ్రతతో నాతో సంభాషించుచు దనయుదంతం బెరింగించి క్రమంబున మదీయ వృత్తాంతము దెలిసికొని యబ్బురపడుచు నిట్లనియె.

దివోదాసధారుణీ దేవేంద్రా ! మీ సాహసౌదార్య విక్రమ క్రమం బత్యద్భు తము. దేవతలు సైతము భవదీయాజ్ఞానువర్తులై ప్రవర్తింపవలసి వచ్చుటచే మీ ప్రభావం బమానుషంబుగదా ! అనంగ మోహినియును గుణవతియును మిమ్మువరించి యుండుట వింతగాదు. జలంధరుని ప్రోద్బలముననే నింత కెన్నేనియనుచితకార్యంబు లొనరించితిని. అనంగమోహినీ రూపమోహితుండనై మదనోన్మాదంబున నామెను గష్టముల పాలు జేయుటయే కాక ధనాదృశులకు గూడ మిగుల నాయాసము గలుగ జేసితిని. నాయవినయమున కిప్పటికి నిక్కముగ బశ్చాత్తాపము బొందుచుంటిని. అనంగమోహినియందలి వాంఛ నాకు పూర్తిగ దొలగిపోయెను. నాకిప్పటినుండి యామె తోడబుట్టువు వంటిది.

ఇక మీద నరిందముండువలె నేనును మీకు మిత్రుడనై యాత్మబాంధువుడనై మెలంగగలవాడను. మీ యాజ్ఞ జవదాటనని త్రికరణంబుల బాస జేయుచున్నాను. నన్ను విశ్వసించి యనంగమోహినీ సమాన్వేషణమునకు నియోగింపుడు. జలంధరు డొనరించిన పాపకృత్యమునకు వానిని బట్టుకొని యుచితరీతి దండించుటకు నా మనంబు తొందరపడుచున్నది. చిత్రలేఖాద్వితీయ గుణవతిని హిమగిరి శిఖరమున నిప్పుడే విడిచివచ్చితిని. ముందుగ జలంధరుని నలకాపురమున వెదకి యందు గనంబడనియెడల వాడెచ్చట దాగియున్నను బోయి పట్టుకొను తలంపు నాకంతయముగా కేగినప్పుడు పుట్టుటచే దిన్నగా నిచ్చటికప్పు డేతెంచెను. ఇందును నేను పురంబులోనికి కేగినప్పుడు లేదని చెప్పుచుండగనే జలంధరుం డచ్చటికి వచ్చి మమ్ము జూచి యక్కజపడ దొడం గెను. వానిని‌ దిలకించిన తోడనే మణిగ్రీవుండు మండిపడుచు నోరీ ! మిత్రద్రోహీ! కపట క్రియారంభ సంరంభుండవై తవ. వ్‌ మ్‌ తేమి? అనంగ [ప్ర నకు ఫలం

వొంచుదు జంంధరు ‌ నన్నా నీ దుర్మార్గ ఎ గాంమాటల కచ్చెటి వెన్పతే సొందగలపం నవమ ఖల 0శెల్ల వాయె