పుట:కాశీమజిలీకథలు-12.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శైలకందరము కథ

97

కొని పోయి యుండును. ఇది నిశ్చయము ఆ మిత్రఘ్ను డెందున్నను వెదకిపట్టుకొని వానిని మట్టుబెట్టువరకు నా మనంబునకు శాంతియుండనేరదు. వాడామెను యక్ష లోకమునకు దీసికొనిపోయి యుండడు. ఎచ్చటనో పివిక్త ప్రదేశంబునకు గొనిపోయి యందు దనకోర్కె దీర్చుకొన జూచుచుండును. కావున నేనిప్పుడే మీరెక్కివచ్చిన విమానముమీద బోయి వాని నరసి యనంగమోహినిని విడిపించుకొని వచ్చెదను. అంత దనుక మీరిచ్చటనే యుండుడని చెప్పి వారి నొప్పించి యప్పుడే యందున్న విమాన మెక్కి మిగులవేగముగా బై కెగరిపోయెను.

గుణవతి చిత్రలేఖతో నందెంతసేపు వేచి యుండినను నెవ్వరి జాడయును గనుపింపలేదు. పిమ్మట చిత్రలేఖ చేయూతగొని యచ్చటినుండి యా యరణ్యమున ముందుగొంత దూరమేగెను. అచ్చట వారికొక నూతన మార్గంబు గనంబడెను. దాని ననుసరించి యా సాయంసమయంబు వరకును వారాయరణ్య మధ్యమున దిరుగు చుండిరి. అప్పుడు వారికెదుర నిర్వురు పురుషులు వచ్చుచున్నట్లు గోచరించెను. వారిని మణిగ్రీవ, జలంధరులని తలంచుచు నతివేగమున సమీపించి చూడగా నందొక డరింద ముండును, రెండవవాడు దివోదాస ధారుణీంద్రుడును నగుటకు గుణవతి మిగుల నబ్బురపడుచు దృటిలో నిజహృదయాధినాధుని పాదపంకేరుహంబులమ్రోల వ్రాలి యుండెను. ఆకస్మికముగా నియ్యరణ్యమధ్యంబున నా యక్షకులకన్యకల గాంచి యా పురుషు లిర్వురును నివ్వెరంబొంది కొంతతడవేమియు మాటలాడజాలకుండిరి.

పిమ్మట దివోదాసుండు గుణవతిని జేతులతో బై కెత్తి యక్కునం జేర్చు కొని మిగుల నాదరించెను చిత్రలేఖవలన వారి వృత్తాంతమంతయును విని విస్మయా వేశ హృదయ సరోజుండై యిట్లనియె. ఔరా! అనంగమోహిని కాపదలమీద నాపదలు గలుగుచుండెను గదా ! అదృష్టచిత్తుని బారిఁపడి యా కాంతామణి యెంత బలవంత బొందుచుండెనో యూహింప శక్యముగాకున్నది కార్యాంతర వ్యగ్రహృదయుండనై యామెను మీ యంతఃపురమున నాడు విడచి నేనరుగవలసి వచ్చినది. నియోగమున మీరువారెందును లేరు. నాటినుండి యిప్పటివరకు నిముసమేని విశ్రాంతి లేకుండ దిరుగు చుంటిని. కాని తలపెట్టినపని మాత్రము పూర్తిగాకున్నది‌. మీరు నాడు ప్రసంగించు కొనిన మనుజబాలక ప్రేతాన్వేషణంబునకే నేను నా లోకమున కేతెంచి యుండుటచే దాని నమ్మవారి యాలయమునందు సంగ్రహించి యందు బ్రాణప్రతిష్ట జేయనెంచి యనంగమోహినిని మీ యింటనుంచి వెడలిపోతిని. అందు దేవి యనుగ్రహంబును నీసన్మిత్రలాభమును బొందితిని. శబరబాలకుడు బ్రాణములంబడసి యెచ్చటికో పోయె నని యమ్మవారివలన వింటినని యా భైరవ యాలయమున జరిగిన వృత్తాంతమెల్ల దెలుపుచు మరియు నిట్లనియె. ఆ యాలయమునుండి శబరబాలకాన్వేషణంబునకు మే