పుట:కాశీమజిలీకథలు-12.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శైలకందరము కథ

95

కోమలాంగి యీ దారినేవచ్చి నీ కిందు నిక్కముగఁ గనంబడియుండును. ఆమె నాకుఁ జిక్కకుండుటకీ చిత్రలేఖ సహాయమున నీ వెచ్చటనో మరుగుపరచి యుందువు. సహ జన్ముడనగు నాపైఁ గనికరము గలిగి యా చిలుకల కొలికిని నా కొసంగి నన్ను రక్షిం పుము. ఆ సుందరాంగి యునికి నెరుఁగకున్న నా హృదయము మదన దావానలంబున వ్రయ్యలగుట నిక్కువమగును. నా మనోపహారిణిని నాకొసంగి పుణ్యము గట్టుకొను మని బ్రతిమాలుకొనుచున్న మణిగ్రీవునకు గుణవతి యిట్లనియె.

ఓరీ ! ఆ సాథ్వీలలామపై నీకుఁగల మరులు మరలించుకొనుము. ఆమె నీకు సహోదరివంటిదని యెరుంగుము. ఆమెను నీవెట్టి బలాత్కారము సేసినను మహాపాతక హేతువని నమ్ముము. ఆ మగువ నెచ్చటనో దాచియుంచి యిట్లపూరపు గథయొకటి గల్పించు చుంటివని సంశయింపవలసి వచ్చుచున్నది. లేకున్న గుహలో శయనించి యున్న యాడుది తన్ముఖమునఁ గాపున్న నిన్ను వంచించి యెచ్చటకుఁ బోగలదు. నీమాటలు సత్యదూరములనుట నిశ్చయము. మీదు మిక్కిలి మేమామెను మరుగున పరచియుంటిమని యెదురువాదు మోపుట నీయబద్ద నాటకమునకు సూచనగా నున్నది. వివేకము గలవాఁడవైన నిప్పుడైన నా సన్నిధినుండి నీవెత్తుకొనిపోయిన మత్తకాశినిని వైళమ నాకప్పగించిపొమ్ము. లేకున్న మీఁద నేమగునో నీవ యాలోచించుకొమ్మని పలుకుచున్న యక్కలికి తలమిన్న కా యక్షకుమారుండు వెండియు నిట్లనియె.

సోదరీ ! నేనెంత జెప్పినను నమ్మకున్న నేమి చేయఁగలవాడను. తాత పాదుని యాన నేనిందేమియు నసత్యమాడలేదు. నన్ను మోసపుచ్చుటకు నీవే యామె నెచ్చటనో దాచియుంచి నాతో బూటకము లాడుచుంటివని నమ్ముచున్నాను. ఈ మహా రణ్య మధ్యమునకు మీరే తెంచుటయును నిందు నీవొక్కతెవుండి చిత్రలేఖ నెచ్చ టకో పంపియుండుటయును సంశయింపఁ దగిన విషయములు గావా? నన్నింక వేద నలంబెట్టుట మాని యా మానినీ శిరోరత్నమును వేగఁ జూపింపుము. నీ మేలెన్నఁడును మరచిపోనని పలుకుచున్న యన్న కాయన్నులమిన్న యిట్లనియె.

అయ్యో ! మేమా యోషామణి నిచ్చటఁ జూచియుండలేదని చెప్పుచున్నను నీవు నమ్మవేమిపాపము ! మమ్మునిర్జించి బలాత్కారముగా నీవామెను తీసికొని పోయిన పిమ్మట నిప్పటివరకు మాకామెజాడ యేమియును దెలియదు. నీ వేగిన పిదప నెదరుగదురు హృదయములతో మేము మొదట నాయంతఃపురమున కరిగి యనంగ మోహిని నెడబాయుటకు వాపోవుచు నీ వలన నామెకెట్టి కష్టము సంభవించుచుండెనో యని యడలుచు నేమిచేయుటకుం దోచక కొంత తడవు నిర్వీన్నులమై యుంటిమి. ఆ సాధ్వీలలామ నెట్లయినను గనుంగొని నీబారినుండి తప్పింపవలయునను దృఢనిశ్చయ ముతోఁ పిదప వీమానమెక్కి యీచిత్రలేఖ సహాయమున మీ కొఱకందందు వెదకుచుఁ గ్రమంబున నీహిమశైల శిఖరంబున కేతెంచితిని. ఇందు రమణీయమగు నీకాసార తీరంబున నించుక విశ్రమింపఁ దలంపు మిగులుటచే నేనిందుండి చిత్రలేఖ నీ ప్రాంత