పుట:కాశీమజిలీకథలు-12.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమసౌధము కథ

87

ఆ యవకాశమున జేయి లోనికి బోనిచ్చి పరీక్షింపనందు జిన్న చక్రము జేతికి దగి లెను. దానిని ద్రిప్పగా నచ్చటి కుడ్యభాగము రెండుమూరలు వెడల్పున బై కెగసి పోయెను. అచ్చట నొక యినుప నిచ్చెన క్రిందికి వ్రేలాడుచు గనంబడెను. అదియే మీది యంతస్తునకు బోవ సాధనమని గ్రహించి దానినెక్కి యా భూపతి యైదవ యంతస్తునకు జేరుకొనెను. అతడు మెట్లపై కెక్కుచుండగా మీదినుండి కుడ్యభాగము దిగజారుచు గ్రమంబున నా మార్గమును బూర్వపురీతిని గప్పివేసెను.

ఆ సౌధమున నమరింపఁబడియున్న యంత్రముల శిల్పినైపుణ్యమున కతఁ డబ్బురపడుచు నా తుదియంతస్తునం దింక నేమైన వింత లుండవచ్చునని తలంచుచు మిగుల శ్రద్దగా విమర్శింపుచుండెను. అందుఁ బ్రాంగణమునందలి కుడ్యములన్నియును నున్నతములగు దర్పణములచే నలంకరింపఁబడి యుండుటచేఁ దన ప్రతిబింబము నా యద్దములయం దన్ని వైపులను జూచి యచ్చట నితరు లెవ్వరో యుండిరని మొదట భ్రమపడి కొంత సేపటికిఁ దన ప్రమాదమును దెలిసికొని నిర్భయముగ నందుఁ దిరుగు చుండెను. అందొక గదియందు స్పటికశిలావికల్పితమగు గోడమీఁద సువర్ణాక్షరములు మణిదీపికలచేత మిగులఁ బ్రకాశించుచుండెను. వానింజదువ నిట్లున్నది.


చ. పుడమిని గాంచనాఖ్య హిమభూధర సచ్చికరంబునుండి యే
    ర్పడిన బిలంబు మార్గమున వచ్చి యిటన్‌ గలరత్నసంతతుల్
    వడిఁ గొనిపోయి శాంభవిని భక్తిదలిర్పఁగఁ బూజసేయువాఁ
    డెడపక యక్షుఁడొక్కఁడితఁడే బిలకర్తయు సౌధభర్తయున్‌.

ఉ. ఇట్టియనర్ఘరత్నముల నెక్కడనుండి గ్రహించి తెచ్చి యి
    ప్పట్టునఁ జేర్చి యక్షుఁడు ధృవంబగు భాగ్యమునెట్లు పొందెనో
    గుట్టెరుఁగంగ గోరుటదికూడిదు గావున నారహస్య మి
    ట్టిట్టిదటంచుఁ దెల్పఁబనియంతయు లేదుగదా తలంపఁగన్‌.

గీ. తివిరియక్షుండు శాంభవీ దేవి నచటఁ
    దేజమలరంగ రత్నాలఁ బూజసేసి
    యిష్టకామ్యంబులను బొంది యేగె నైజ
    లోకమునకు సంమోదాతిరేకుఁ డగుచు.

మ. నిజజన్మస్థలమందుఁ బ్రేమమిగులన్‌ నిర్ణద్రతేజుండు య
     క్షుజుఁ డట్లేగుచు నిందుగాంచిన మహైశ్వర్యంబుగొంపోక యి
     ట్లజుఁడై నన్‌ గనలేని చోట నిట మాద్య ద్రీతి రక్షింప న
     క్కజమౌయంత్రములెన్నియేని నతఁడే గల్పించెఁ బొల్పొప్పగన్‌.

శా. ఈయంత్రంబులఁ జిక్కికిందుఁగల గుట్టెల్లన్‌ మహాభాగ్య ప
    ర్యాయంబొప్పఁగ నెవ్వడే నెఱుఁగునో యాపుణ్యుఁడే దీనికిన్‌