పుట:కాశీమజిలీకథలు-12.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమసౌధము కథ

85

వెనుకకుఁ దిరిగిచూడ దా నింతకుఁ జనుదెంచిన బిలమార్గ మెందున్నదో యించుకయును గుర్తు తెలియలేదు. నలుమూలలయందును మిగుల నున్నతములగు పర్వతపంక్తులు నందందుఁగల వృక్షశ్రేణులును మాత్రము గోచరమగుచుండెను.


హేమసౌధముకథ

దివోదాసుండు విస్మయముతో ముందు గొంత దూరమరుగ నచ్చట నొక నిర్మల సరోవరంబు తీరంబున నున్న హేమసౌధంబొండు వానికి నేత్రపర్వ మొన ర్చెను. అతిజవంబున నడచుచు నా పుడమి యొడయండు దృటిలో దానిని సమీ పించెను. ఆ సుందరహర్మ్యము నిర్మల ధర్మమయమై యనర్ఘ రత్నఖచిత ప్రదేశ ప్రదీ ప్తమై యనేక యున్న తాంకరవిరాజితమై యత్యంత శోభాయమానమై యలరారు చుండెను. అట్టి సౌధాభ్యంతరంబున నేమివింతలు గలవో లోనికేగి చూచుటకు గుతూ హలపడుచు రాజేంద్రుం డా సౌథ ద్వార ప్రదేశమున కేతెంచెను. ఆ ద్వారము ఇనుప తలుపులతో లెస్సగా బిగింపబడియున్నది. దానిముందు భయంకర రూపంబుల నొప్పు చున్న రెండు సింహము లభిముఖముగా నిలువంబడియుండ యొక దానిమీద నింకొ కటి దుముక నుంకించుచున్నట్లు గనుపించుచుండెను.

వానిం జూచినతోడనే దివోదానున కించుక వెరపు గలిగెను. కాని యంతలో ధైర్యము దెచ్చుకొని మొలనున్న కటారి నొఱలోనుండి యూడఁబెరికి బాహుబలం బూతగా నా హర్యక్షముల తలలు వరుసగ నరికివేసెను. తోడనే సంవర్త సమయ సముద్భూత ప్రచండ వాతో ద్దూత జీమూతవ్రాత సమ్మేళనోద్దికానూన గర్జా సదృక్షంబగు మహాధ్వానంబు వెడలి దిక్కులఁ బిక్కటిల్లజేసెను. ఆ భయంకర నిస్వ నంబునకు దద్దరిల్లుచు రాజేంద్రుఁడు గ‌నులు మూసి తెరచునప్పటి కా మృగముల యంగములన్నియును విడిపోయి యున్నవి. సౌధద్వారము వివృతమగుటచే లోపల నుండి కనులకు మిరుమిట్లు గొల్పు తేజఃపుంజ మేతెంచి బయలాక్రమించియుండెను. తా నిదివఱకుఁ దలలు నరికినవి కృత్రిమ పంచాస్యములని తెలిసికొని యా భూమీంద్రుం డద్భుతమందుచు నవి యీ సౌధద్వారము దెరచుట కేర్పరుపఁ బడిన సాధనము లని గ్రహించెను. జీవకళతో నొప్పియుండుట నట్లా మృగముల నిర్మించినవాని పనితన మును బెద్దగా నగ్గించెను.

అట్లు వివృతమైయున్న ద్వారమున నా సౌధములోనికి దివోదాసుండు ప్రవేశించుటే తడవుగ నా ద్వారకవాటము బెద్ధధ్వనితోఁ దిరుగ మూసికొనిపోయెను. హర్యక్షములును దమతమ స్థానములందు బూర్వపురీతిని నిలువఁబడి యుండెను. ఆ సౌధమున మొదటి యంతస్తునందు బది విశాలములగు గదులు గలవు. అవి యన్ని