పుట:కాశీమజిలీకథలు-12.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము


    మనమున భక్తినిన్గొలిచి మాటి కభీష్టములందనట్టి డెం
    దునుగనరాడు నన్ను పరతోషితచిత్తునొనర్పుమీశ్వరీ.

అని యా భైరవీదేవికి భక్తియుక్తుడై ప్రణమిల్లుచు నిక దక్కినకృత్యము నెర వేర్చి కృతకృత్యుడ నయ్యెదంగాక యని లేచి చంద్రహాసము గరమునబూని యందున్న పెట్టెదాపునకేగి మూతనెత్తి వంగి యందున్న శవమును బైటకుదీయ నుంకించుచుండెను.

ఇంతలో బ్రళయకాల వలాహకంబుకైవడి దివోదాసుండు క్రోధాతిరేకమున హుమ్మని గర్జించుచు నయ్యమ్మవారి చాటుననుండి ముందునకురికి యా యక్షుని జుట్టు పట్టుకొని యీవలకీడ్చి భైరవీదేవి పాదమూలమున బడవైచి నిజకుఠారధారలచే నా కుచ్చితుని యుత్తమాంగము నుత్తరించి తద్రుధిర ధారలచే నా దేవి పాదములగడిగి వాని హృదయపిండము బెకలించి యా శక్తికి నై వేద్యమర్పింపనెంచెను.

కాకా వాని యభిమత మీడేరినదికాదు. ఎన్ని సారులు వాని తల నరుకబడి నను నెప్పటికప్పుడది మొండెమునకు జేరుచుండెను ఇట్లా రాజేంద్రుండా యక్ష ధోర్తుని సంహరింపజాలక నిర్విణ్గుడై యూరకుండెను. యక్షకుమారుండు విగత జీవుడుగాకున్నను దలవని తలంపుగా దనకందుగలిగిన విపత్తువలన గుండెచెదరి విస్పృహుడై యా యమ్మవారి పాదమూలమునబడి యుండెను.

ఆ రాజసింహుడు యక్షుండు మృతుండయ్యెనని దలంచి యా దేవి యెదుర వినయ వినమితగాత్రుడై చేతులు జోడించి నిలువబడి యనేకవిధముల స్తుతి యించెను. భైరవీదేవి వాని‌స్తోత్రంబుల కలరి ప్రత్యక్షమై యిచ్చవచ్చిన వరంబొండు కోరుకొనుమని యానతిచ్చెను. అమ్మహారాజు భయభక్తి పురస్సరముగ దల్లీ ! ఈ యక్షకుమార మరణమున గాకే దురితమును గలుగకుండ వరంబిమ్మని కోరుకొనెను.

వాని కోరికకు భైరవీదేవి సంతసించి యిట్ల నియె. కుమారా ! నీ యుదంత మంతయు నంతర్దృష్టిం దెలిసికొంటిని. నీ పరోపకార పారీణతకే నెంతయును సంత సించితిని నీ ధర్మబుద్ధి నీ నిర్మల ప్రవర్తనము నీ వినయవివేక విశ్వాసంబులు నీ సాహసౌందర్యసంపత్తి నీ బలపరాక్రమములు వర్ణనార్హ ములు. నీవొనరించిన కృత్యము లెన్నడును దర్మబద్ధములై యుండును. ఈ యక్షుడు కపటచిత్తుడు. యుక్తాయుక్త పరిజ్ఞాన శూన్యుండు క్రూరకార్యాచరణ పరాయణుండు. వీడు జచ్చి యక్షకులము నకు గళంకమేలేకుండ బోయెడిని వీనికై నీవు చింతింప నక్కరలేదని పలుకు నమ్మహాదేవికి మహారాజు వెండియు నిట్లనియె.

జననీ ! వంచనజేసి యీ యక్షుడు పుడమికేతెంచి యమాయకుండగు నీ శబరబాలకుని నొకనాగముచే గఱపించి యసుపులఁ బాయఁ జేసెను. ఈ బాలకుని బ్రతికించి యిచ్చెదనని వీని యాప్తుల సన్నిధి నేను బాసజేసి వచ్చితిని. నా మాట