పుట:కాశీమజిలీకథలు-12.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనంగమోహిని కథ

47

ప్రాంతముల కొకయశ్వశకటమునెక్కి యరిగితిని. ఆ బండికిఁగట్టిన యశ్వము చోద కుని యాజ్ఞానువర్తిగాక బండి నెక్కడికో తీసికొనిపోయి యొకచో నిలచినది. అప్పుడు బండివాఁడు క్రిందకు దిగి యశ్వమును ప్రాంతమందున్న సరస్తీరమున నీరుద్రావించుటకుఁ దీసికొనిపోయెను మేమును బండిదిగి యింతలోయూరకయుండనేల నని యాప్రాంతవిశేషములఁజూడ నొకమార్గమునుబట్టి కొంతదూర మరిగితిమి ఎదుర కనకమయగోపుర ప్రాకారములతో నొప్పు దేవతాయతబొండు నేత్రపర్వంబొనర్చు టయు మేమతికుతూహలమున నచ్చటి కరిగితిమి. అదియొక యమ్మవారి యాలయము. అందెవ్వరును లేరు. కవాటములు తెఱచియే యుండుటచే మేము నిరాటంకముగా నా దేవి యాలయమున వ్రవేశించి ముమ్మారువలఁగొని యమ్మవారిని సందర్శింప గర్భా లయమున కరిగితిమి. అందు సహస్రసంఖ్యాకములగు దీపములు వెలుగుచున్నవి. దివ్య ధూపవాసనలు దిశల వ్యాపించుచున్నవి. నానాజాతిపుష్ప పరిమెళద్గంఢ వహాంకూరములు హృదయంగమమై యొప్పుచుండెను. ఆ దేవినప్పుడే యెవ్వరో యర్చించినరీతిని యందున్న ధూపదీపమాల్యాలంకారములు తెలుపుచున్నవి. ఆ యమ్మ వారిపీఠముముందు పాఅతాళేశ్వరియని చెక్కఁబడిన సువర్ణాక్షరములు దీపకాంతులచే ధగద్ధగాయమానముగ వెలుఁగు చుండెను. ఆ దేవింజూచి భక్తిపురస్సరముగా ననేక విధముల స్తుతియించి చేతులు జోడించి, లోకైకజననీ ! నేఁడు నీ దివ్యదర్శనముఁజేసి చరితార్దురాలనైతిని నాజననము పావనంబయ్యెను. అనురూపవరుని సమకూర్చి నాకు సంతోషమాపాదింపుము. నీపాదభక్తి నెన్నఁడును నెడబాయని బుద్ధి నాకు గలిగింపుము. అని వేడుకొనుచున్న నాకమ్మవారు దరహాసిత ముఖాంబుజయై పుత్రీ! నీ యదృష్టము మంచిది. అనతి కాలముననే యొక్కదివ్యప్రభావ సంపన్నుఁడగు పురుషుని పాణింబట్టి యనంత సుఖములం బడయగలవు నీకు సంభవించు నిక్కట్టులన్నియు నాతడే తీర్పగలడు. నీ శిరోభూషణమందలి రత్నము మృతసంజీవిని యను నామముగలది మరణించినవారు దాని స్పర్శ లేశమాత్రంబుననే బ్రతుకగలరు. అని చెప్పుచు నొక యద్భుతఫలంబు నాకిచ్చి యీ ఫలంబును వెంటనే భుజింపుము. దీనిందినిన వారికి క్షుత్పిపాసలుండవని యానతిచ్చినది.

అప్పుడు నేను నిరతిశయానందహృదయ సరోజాతనై యాభువనేశ్వరి పాదపద్మంబులకు సాష్టాంగ మొనరించియున్న తఱి నా చెలికత్తియ లందున్న పెద్ద గంట మ్రోగింపఁ దొడంగిరి. ఆ ధ్వనిచేతనో మఱెందు వలననో నాకు నిద్రాభంగ‌ మైనది. అంత మేల్కొని యిటునటు పరికింప నా ప్రక్కలో నమ్మవారిచ్చిన ఫలము గనంబడినది దానికి వెఱఁగందుచు నేను నిక్కముగా నమ్మవారి గుడికిఁ బోతినాయని వితర్కించుఁకొనుచు దేవీవచనంబు వడువున నీపండుదినినఁ దప్పేమని యాలోచిం చుచు నా క్షణము దానింగోసి యాప్యాయనంబుగ భక్షించి దానిరుచి విశేషంబునకు మిక్కిలి యద్భుతమందితిని.