పుట:కాశీమజిలీకథలు-12.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

అందెవ్వఁడో యొక్కఁడు మడియువఱకు నదివృద్ధిఁబొందుచునేయుండును. తలుపు తీయుము. నీకు వచ్చిన భయమేమియునులేదు. అని పలుకుచుండగనే యనంగమోహిని కవాటము తెఱచుకొని యావలకు వచ్చి హేమావతి పాదమూలమునఁ బడినది.

హేమావతి యామెను లేవనెత్తి యనునయించుచుఁ బుత్రీ! భయపడకుము. నీకా తుంటరులవలన నేయాపదయును రాకుండ నేను గాపాడెదను. శోకంబపనయించు కొనుము. నన్న న్యురాలిగా దలంపకుము. నీకోపినంత సహాయము జేయుటకు సంసిద్ధు రాలనై యుంటిని. అనన్యసామాన్యరూపలావణ్యముల నలరారు నీవు శుద్దాంతమున నుండక యాహిమవత్పర్వత ప్రాంతారణ్యముల కెట్లువచ్చితివి? నీ తలిదండ్రులెవ్వరు? నీ నివాసంబెయ్యదిఁ నీ వృత్తాంతమును విన గుతూహలపడుచున్న దానను గోప్య ముగాదేని చెప్పుమనుటయు నా యన్నులమిన్న యొకింత ధైర్యము దెచ్చుకొని యిట్లనియె.

అమ్మా ! నికృష్టురాలనగు నా యుదంతముఁజెప్పి నీకుఁగూడ విచారమును దెచ్చిపెట్టుట కిష్టము లేకున్నది. అయినను నీవింత యాదరమున నడుగుచుండఁ జెప్ప కుండుట‌ సమంజసముగాదు. నేను నాగలోక వాసుండగు వాసుకియను నరేన్యప పరీవృఢుని తనూజాతను. అనంగ మోహినియనుదానను. నన్ను నా తల్లిదండ్రులు బిన్ననాటఁగోలె నల్లారుముద్దుగఁ బోషించుచు సమస్తవిద్యల నుపాధ్యాయులచేత మా యింటియొద్దనే నాకు నేర్చించిరి. అసమాన వయోరూపనిశాచాతుర్యముల నలరారు నాకు దగినవరుని సమకూర్పవలె నని నాతండ్రి విశ్వ ప్రయత్నములఁ జేయుచు నాగ లోకమునందెందును నాకనురూపుడైన పురుషుండు లభింపక యా విచారమున నిరం తరముఁ గృశించుచుండెను.

ఒకనాఁడు నేను చెలిమికత్తెలతో గృహనిష్కుమ ప్రదేశమున విలాసముగా విహరించుచుండుటఁ గనిపెట్టి యొక రాత్రించరుండు నన్నపహరించి పైకెగసెను. ఇంతవఱకే నే నెరుంగుదును. శోకభయ విహ్వలనై యుండుటచేత వాఁడు నన్నెచ్చో టకుఁ గొంపోయెనో చెప్పజాలనుగాని నాకుఁ దెలివి వచ్చుసరికి నేనొకపర్వత శిఖరమున గుహా ముఖమున నతనిచేఁ గల్పింపఁబడిన శయ్యయందుంటిని. అచ్చట నేనొంటిగా నుండుటకు భయంపడుచు నాశయ్యనుండి మెల్లగాలేచి నలుమూలలు బరికింపఁదొడంగి తిని. ప్రాంతమం దిరువురురక్క సులుక్కుమెయిఁ గయ్యమాడుచుండుటఁ బరికించి యక్కడనున్న నేమి కీడుమూడునోయని యొకమారుమూల దారింబడి పారిపోయితిని.

అట్లు పోయిపోయి యెదుర నిర్మలజలాశయముగని యందలి జలముల నాపోవఁద్రావి యాప్రాంతశీతలతరుచ్ఛాయల బడలికలువాయ విశ్రమించితిని. ఇంతలో నాకెక్కడ లేనినిద్ర వచ్చినందున నచ్చటనే హస్తోపధానముగఁ బండుకొని గాఢముగ నిద్రబోతిని కొంతసేపటికి నాకొకన్వప్న మిట్లు వచ్చినది.

నాగలోకమున ననుంగకత్తెలు బలువురు పరివేష్టించిరా విహారార్ధమై యా