పుట:కాశీమజిలీకథలు-12.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

ర్యునిఁ జేసినది. కొంతసేపటికి మణిగ్రీవ జలంధరు లారక్కసుఁ బరిమార్చి హేమా వతిని సమీపించిరి. వారి విక్రమ విహారము గన్నులారఁ జూచిన యా యచ్చర కాయక్షకుమారులయందు నిరూపమానమైన యనురాగము గల్గి సంతోషాతిశయంబున నిరువుర నొక్కసారిగఁ గౌఁగలించుకొన్నది. ఆ దృఢాశ్లేష విశేషమున నయ్యిరువురు పురుషులు సాత్వికానంద పరవశులైరి అయ్యోషామణి గలియ నిరువురకు బుద్ది బుట్టి నది. మోహ మూర్చితులై యానదివద్వయం బొక్కింతతడవు నిశ్చేష్టితులైరి. హేమా వతివైపుదృష్టులఁ బరగించుచు నొకరినొకరు జూచుకొనుచుఁ దమ యాంతర్యముల వ్యక్తీకరింపఁ జాలక యున్మాదుల క్రియఁ బ్రవర్తింపఁ దొడంగిరి

హేమావతి కాయిరువురు సుందర పురుషులయందును సమానానురాగము మనంబునఁ గలిగియున్న కతంబున వారిపై విలాస దృష్టులఁ బరగించుచు మంద హాసము మొగమునకు సగమై మెరయ నిట్లనియె.

సుందరపురుషులారా ! మీరు నేఁడీ రక్కసునిఁ బరిమార్చి నాకెంతేని మేలొనర్చితిరి. మీకు నేను సర్వదా కృతజ్ఞురాలను మీరు చేసిన యుపకారమునకుఁ బ్రతిగ నా హృదయమునే మీకర్పించుచున్న దానను. నేను అమరావతీ పురమున నుండు దేవవేశ్యను. మీవయోరూప విలాసములకుఁ బూర్తిగాఁ వశ్యురాలనైతిని. అమర నగరంబెల్ల నేఁడు రక్కసులచే నాక్రమింపఁబడియున్నది నే నందేగినఁ దిరుగ నెట్టి యాపదలకుఁ బాల్పడవలసివచ్చునో తెలియదు. కావునఁ గొంతకొలము నన్ను మీరే సంరక్షింపవలయునని ప్రార్ధించు నాయోషామణి పలుకుల కలరుచు మణిగ్రీవుం డిట్లనియె.

మదవతీ! మే మిరువురమును యక్షవంశ సంజాతులము. నేను చిత్రకేతుని తనూజుండును. ఈతండును నా ప్రాణమిత్రుఁడు. జలంధరుండనువాఁడు. అలకా పురమే మా కాపురము. మాకు దేహములు భిన్నములైనను ప్రాణము లొక్కటి యనియే గ్రహింపుము. మా యిరువురకు నీవు సమానోపభోగ్యవై యుండుటకు మాకుఁ బరమ సమ్మతము. మఱియుసు నీవు యదేచ్చగ మా క్రీడాసౌధమున నివసించియుండ వచ్చును. అందు నీ కేలోపము రాకుండఁ జూచుకొనుచుందుము. మా కన్నులలోఁ బెట్టుకొని నిన్ను కాపాడు కొనఁగలమని చెప్పెను.

జలంధరుఁ డందుల కామోదించెను. అనన్య సామాన్యరూప లావణ్యంబుల నొప్పియున్న యొప్పులకుప్ప తమ్ము వరించుటచే ధన్యుల మైతిమని తమ బాగధేయ మును బ్రశంసించుకొనెను. మణిగ్రీవునకుఁ దన యందుఁ గల వాత్సల్యమునకు వానినిఁ పెద్దగ నగ్గించెను. పిమ్మట నయ్యప్సరోభామినితో నా మిత్రులిర్వురును బెద్ద తడ వగ్గిరి. కూటముల విలాస విహార మొసరించి మించిన యానందమున నద్దివ సాంతమునకు నిజ నివాసంబున కరిగి హేమవతిని రహస్యముగా నొక క్రీడాసౌధం బున నుంచి సంతత మామెతో నిష్టోపభోగంబులఁ జెలంగుచుండిరి. హేమగిరి శిఖరం