పుట:కాశీమజిలీకథలు-12.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుంభనికుంభుల కథ

35


మ. పొలతీ ! నీకు వశంవదుండ నయితిన్‌ బూజింతు ని న్నెప్పుడున్‌
     దలపైఁ దాల్చెద నీదు శాసనము నిత్యం బేను నీకన్ను స
     న్నల‌ వర్తించెద ప్రాణపంచకము కన్నన్‌ మిన్నగాఁ జూచి ని
     న్నలరన్‌ జేసెద నేలుకోగదవె మా ద్యత్ప్రీతి నన్నింకిటన్‌.

మదవతీ ! మదనుఁ డదయుఁడై పదను టడిదంబుల నాపై నేయు చున్నాఁడు నీ కటాక్షరప్రసారం బించుక బరపి నా హృదయతాపంబు జల్లార్పుము. అని మిక్కిలి దీనుడనై బ్రతిమాలుకొంటిని.

అప్పుడా బిబ్బోకవతి తోకత్రొక్కి.న త్రాచువలె గస్సుమనిలేచి నన్ననేక దుర్భాషలాడుచు ఛీ ! ఛీ! మూర్ఖుఁడా ! బుద్ధికలిగి‌ ప్రవర్తింపుము. నోటికి వచ్చి ట్లెల్ల వదరుటమాని యవలం బొమ్ము అని వామపాదం బెత్తి గట్టిగా నన్ను తన్ని నది.‌ ఆ తాపుతో నా కెక్కడలేని క్రోధావమానంబులు బుట్టినవి. ఆమెతో తీక్ష్ణంబుగా నేమీ ! నెమ్మదిగా బలుకుచుంటినని నోటికి వచ్చినట్లెల్ల దూషించుచుంటివి. నీకొక నిముషము వ్యవధి నొసంగితిని ఆలోచించుకొనుము. వృధాగా గష్టములఁ బడక నా కోరిక తీర్పుము. లేదేని నిన్నిందు బలాత్కరింపక మానను అప్పుడు నీకెవ్వరడ్డము వత్తురో జూచెదంగాక యని పలుకు నా పలుకుల కా కలకి తలమిన్నబొమలు ముడి వైచుచు నీచుఁడా ! నేనిం దేకాకినై నీకుఁ జిక్కియుంటినని యిచ్చవచ్చినట్లు కారు లరచుచున్నావురా ? సర్వవ్యాపకుండైన పరమేశ్వరుండు నీదుందుడుకు చేష్టల‌ గమ నించుచునే యున్నాఁడని యెరుంగుము. నీ బీరములు వానియెదురఁ బనికిరావు‌. పో, పొమ్మని గద్దించి పలికినది.

అప్పుడు నే నహంకరించుచు పాపినీ ! మంచిమాటల నేనెంత బ్రతిమాలు కొనుచున్నను మీదుమిగులచుంటివిగదా ! నిన్నుగాపాడఁ గలవారి నెవ్వరినో వైళమ రమ్మని బలుకుచు నా నారీశిరోమణి శిరోజంబులం బట్టికొని నేను చెప్పినట్లు వినెదవా లేదా యని యదలించుచుండగా నామె పెద్ద యెలుంగున‌ హా! పరమేశ్వరా! రక్షింపు రక్షింపు మని యాక్రోశించుచు నేల కొరిగినది. అప్పుడు తచ్చిరోరత్నము నాచేతిలోఁ జిక్కినది.

అంతలో నో భీరులోకామా ! భయపడకుము. నిన్ను రక్షించుటకు పర మేశ్వరుండు నన్నిందు బంపినాడని పలుకుచు నొక్క పరుగున దివోదాసుండు మేమున్న దెసకు వచ్చెను. వానిం జూచినతోడనే నేను భయవిహ్వలుండనై పారిపోఁ దొడంగితిని. కాని యా ధీరుండు పది యడుగులలో వచ్చి నన్ను కలిసికొని చంద్ర హాసముతో నొక్క పోటు పొడిచెను. అప్పుడు నేను విధిలేక వానితో ద్వంద్వయుద్ధంబు నకు గడంగితిని అనంగమోహినియు విస్మయముతో దూరముననుండి మా యిరువుర కయ్య మీక్షించుచుండెను. నేనమ్మహారాజుతోఁ బెద్ద యుద్ధము జేసితిని ఆ వీరోత్తము నితో నట్లు పెనంగుటకుఁ నాకెక్కడి బలము వచ్చినదో నాకే వింతదోచినది నా చేతి