పుట:కాశీమజిలీకథలు-12.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము


    పూగుత్తులం దెచ్చి పొలతిఁతికిచ్చి యొకండు
           గై సేసి యొకఁడు రాగంబు దెలిపి
    ఒకఁడు కపోలంబు లొకఁడు నెమ్మోమును
           సవరించి యతివ కిష్టంబు సూపి
    తమినొక్కఁడతివఁబెద్దగఁ గౌగలించి యుం
           కొకఁడుముద్దుంగొని యుబ్బుజెంది.

గీ. మిత్రులిర్వురు ప్రియసఖిమీఁది ప్రేమ
    నిముసనిముసంబునకు గాఢతమముగాగ
    స్వేచ్చ నాహేమ భూధరసీమలందు
    బహువిలాస విహారముల్‌ బరపిరొకట.

మ. ఫలపుష్పంబులఁ గోసియిచ్చు నొకఁడప్పాటన్‌ బ్రకాశించు వృ
     క్ష లతాదుల్‌ వివరించు నొక్కఁడట సుశ్రావ్యంబుగాఁబాడు ప
     క్షుల సాధుధ్వనులెల్ల నెన్ను నొకఁడస్తోకంబుగాఁ దెల్పు ని
     ర్మలకాసార విశేషముల్ సతకి ప్రేమంబొప్ప నొక్కండటన్‌.

ఇట్లు స్వచ్ఛందగతిని విహరించుచున్న సమయంబున వారికి దూరంబున వీరాలాపంబుల సందడి కొంతవినంబడెను. దానికి వారు వెరగందుచుఁ దక్షణమె విమానమెక్కి యా చక్కికింబోయిరి. అందొక చక్కని చక్కెరబోణి భయవిహ్వల శోకరసంబులు మొగంబునందోప దూరంబుననుండి యిరువురు పురుషుల కయ్య మీక్షించుచున్నది. ఆ యన్నుమిన్నం జూచిన తోడనే మణిగ్రీవుండు పంచశర శరా విద్ధహృదయుండై యన్యమెరుంగ కుండెను జలంధరుండును మోహ మూర్చితుం డయ్యెను‌. అయ్యచ్చర మచ్చరముతో నాయబల యంగసౌష్టవ మీక్షించుచుండెను.

ఇంతలో ద్వంద్వయుద్దమొనరించు పురుషులిర్వురిలో నొకనికి దీవ్రమగు గాయ ములు దగులుటంజేసి సొమ్మవోయి నేల కొరగెను. జయశీలుండగు పురుషసింహుఁడు క్రిందఁబడినవానిని రెండుచేతులతో బై కెత్తి యందున్న గుహాముఖంబున విసరివైచెను. తద్బిలము పాతాళమువరకు వ్యాపించియున్నది. అతిజవంబున విసరఁబడుటచే వాని కళేబరంబు బిలముత్రోవను దిన్నగా రసాతలంబున బలిచక్రవర్తి కేళీ సౌధంబునఁ బడినది.

ఇచ్చట యుద్ధమీక్షించుచున్న లోలాక్షిసత్వరమె యజ్జయశీలునిపాదంబులం బడి పురుషప్రవరా ! యుష్మద్బలప్రతాప శౌర్య సాహసంబులు వర్ణనాతీతంబులు. ఆమ్రుక్కడిరక్కసు నవలీలనిర్జించి నన్ను రక్షించిన మీయవ్యాజకరుణాకటాక్షంబులకు నిరంతరము కృతజ్ఞురాలను. భవదీయ సుందర ముఖారవిందసందర్శన మాత్రంబుననే మదీయ మనోగత దుఃఖోపతాపంబు పటాపంచలయ్యెను. మీ రూపంబు కంతువసంత