పుట:కాశీమజిలీకథలు-12.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

శేషవాసుకులట్లు పోయి బలిదైత్యేంద్రు నగరి మొగసాలఁగాపున్న దైత్యాంతకునింగాంచి వానిపాదంబులంబడి తమ యిక్కట్టు విన్నవించి రక్షింపవే యని ప్రార్థించుటయు నప్పార్థసారథి యేమియు నుత్తరంబొసగక హస్తవిన్యాసంబున బలి కెరింగించు కొనుఁడని సూచించెను. తదాదేశంబున వారు లోనికిం బోయి యా దాన వేశ్వరుని యెదురసాగిలిమ్రొక్కుచుఁ దమ యుదంతంబంతయు నెరింగించి యాపన్నులఁ గాపాడుమని వేడుకొనిరి

వారి దీనాలాపముల నాలకించి యాదానవ సార్వభౌముండు రోషవిషా దంబులు మొగంబునందోప నౌరా ! ఈ మ్రుక్కడిరక్కసుల దుందుడుకు చేష్టల కంతములేకున్నదిగదా? నే నెన్నివిధముల వారిని మంచి మార్గమునఁ బెట్టఁబ్రయత్నించు చున్నను వారు సహజంబగు దుష్టస్వభావమును విడువఁజాలకున్నారు. ఇట్టిదుండగీండ్ర కతంబుననే మత్కులంబును కంతకును నపఖ్యాతి గలుగుచున్నది. వీండ్ర నుపేక్షింప రాదు. వాసుకి పుత్రికారత్నమును బలిమిమై నపహరించిన యాపాపాత్ము నెరింగి తగినరీతి శిక్షించెదఁగాక. అని పలుకు చండఁగనే కొందఱు సేవకు లరుదెంచి బలిచక్రవర్తికి నమస్కరించుచు నిట్లని విన్నవించిరి.

రాక్షసేశ్వరా ! నేఁడు ప్రభువారి కేళీసౌధంబున మీది యంతస్థునందు పైనుండి గుభేలుమను శబ్దముతో నొకరాకాసిశవంబు బడినది తత్పతసధ్వనివలన నందున్న మేమెల్లరము నిర్ఘాంతపడితమి. పిమ్మట విమర్శింప నది కుంభుఁడను దైత్యునిశరీరమని తెలిసికొంటిమి వాఁడెట్లుచచ్చి యచ్చటపడెనో మాకు వింతఁగొలుపు చుండెను. వాని శరీరంబు గత్తినరకులు వేనవేలుగఁగలిగి రక్తసిక్తమైయుండెను. దీనిని విమర్శింప దే రయే కర్తలని పలికి యూరకుండిరి.

ఆ మాటలువిని యాదనుజవల్లభుండు మిక్కి.లి యక్కజంపడుచు శేష వాసుకులతో నారక్కసి పడినచోటికి సేవకులు మార్గముచూపుచుండ బోయివాని యవయవంబులఁబరీక్షించెను. వాని యపకారమును జూచి యెల్లరును భయవిస్మయావేశ హృదయులైరి.

కుంభుని శరీరమునందలి గాయములనుండి స్రవించురక్తధారలంగాంచి వాఁడు మృతిఁజెంది యుండలేదని తలంచుచు బలిచక్రవర్తి సరీనృప కులనాయకులతో నావిషయమే ముచ్చటించుచుండఁ గొంతసేపటికి కుంభునకుఁ జైతన్యము గలుగునట్లు కసిపించినది. ఇంక గొంతసేపటికి వాని మూల్గువినంబడినది. మరికొంతసేపటికి నేమేమో గొణుగుకొనుచున్నట్లు తోచినది. అటుపిమ్మటఁ గొంతసేపటికి వాఁడు భీకర ముగా నిలునిలు దురాత్మా ! ఈ దెబ్బతో నీ శిరంబు పగులఁగలదని యరచుచు లేవం బోయి క్రిందబడి తిరుగ గాఢమగు మూర్చలోమునిగెను. వెంటనే దైత్యేంద్రుఁడు పలువుర పరిచారకుల రప్పించి వానిని చికిత్సాలయమునకుం బంపి యందుఁ గొందర నుపచారము లొనర్ప నియమించెను. ఆ దానవుం డెవ్వనిచేతనో తీవ్రమగు గాయముల