పుట:కాశీమజిలీకథలు-12.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దివోదాసుని కథ

17

కొండిక వింతగాఁ దానితోక పట్టుకొని పైకెత్తి యాడింపసాగెనఁట. ఇట్లాడించు చుండఁగనే యా పాపరేఁడు ఫైకి తిరిగి వాని చేతీమీఁదఁ బెద్ద కాటువేసెను దానితో వాఁడమ్మోయని యరచుచు నేలంబడి విలవిలం దన్నుకొనుచు జీవనములఁ బాసెను. పట్టు వదలిన నాగము మెల్లఁగా గొండొక కలుగులో దూరి మాయమాయెను. చేరువ నున్న బాలకు లాక్రోశించుచు నిండ్ల కేతంచి యా వృత్తాంతమంతయు మా కెరిం గించిరి. మేమును బడితెలు బల్లెములు మొదలగు సాథనములతో నాప్రాంతముల కరిగి యాపుర్వుం బట్టుకొనవలెనని‌ యెంత ప్రయత్నించినను నది కనంబడినది కాదు. బాబూ ! మా పిన్నవాని పాలిటికది మృత్యువువలె వచ్చి మాయమైనది. నీ యేల్బడి యందిట్టి యన్యాయమెందును గనివిని యెరుంగము. మేమెన్ని మంత్రతంత్రంబు లుపయోగించినను గార్యము లేకపోయినది. మా పిల్లవానిని బ్రతికించి మాకిచ్చుటకు న్యాయపరిపాలకుఁడవగు నీదియే భారము. నీ యాజ్ఞయగువరకు నా బాలకుని శవమందే యొకచోఁ బెట్టి పలువురఁ గాపుంచి వచ్చితిమి.

అని వారు చెప్పినతోడనే దివోదాసుండు క్రోధ తామ్రాక్షుఁడై యౌడు గరచుచు నేనేమి ! నా యాజ్ఞల దిరస్కరించి వంచనమై మేదినినుండుటయే గాక యా పాపపుఁబురుగు మానిదిబుడుతం గూడఁ గరువ సాహసించెగా ! పదుఁడు, పదుఁడు, నేనిదే మీ వెంటవచ్చి యా చిలువ నెందున్నఁ బట్టి చిదుగఁగొట్టి మీ పట్టికిఁ దగిన ప్రతీకార మొనరించి యిచ్చెదంగాక. అని యా ఱేఁడు మిగుల వేగముగలతత్తడి నా యత్తపరపించి దానినెక్కి కతిపయసేవక సమూహము వెంటరా నమ్మన్నె కాండ్రతో నటఁగదలి క్రమంబున నమ్మహారణ్యంబు జేరెను.

పిమ్మట నందా మృతబాలక కళేబర మెందున్నదో చూపుఁడని యబ్బో యల నా రాజేంద్రుండడుగుటయు నచ్చోట కాపున్నవాండ్రు చేతులు నలుపుకొనుచు దేవరా ! ఏమని చెప్పుదుము. ఇ9త వింత మే మెందును వినలేదు. మాచే సంరక్షింప బడుచున్న యాశవమేమైనదో మాకుఁ దెలియుటలేదు. దాని చుట్టును మేమతి జాగ రూకతతోఁ గాపుంటిమి. ఉన్నట్లెయుండి యది మాయమైనది. అది యీ విధముగా బోయినదని చెప్పఁజాలకున్నాము. ఘాతుకమృగమేదియైనఁ గొనిపోయినదనుట కట్టి గుర్తు లేమియును గానరావు. పైవారెవరును వచ్చిన జాడ గనంబడదు. ఇది యింద్ర జాలమువలె నున్నది. అని దీనాసనులై విన్నవించు నా యాటవికుల ననునయించుచు రాజేంద్రుఁ డిట్లనియె.

శబరులారా ! వెరువకుఁడు. ఇది యంతయును నురగుల తరటితనమున వచ్చినది. మీ బాలక కశేబరంబును గుప్తపరచినది. గూడ నాగకులంబే కావచ్చును. తమ యవినయకృత్యంబును గప్పిపుచ్చుట కట్లు చేసియుందురు. ఏది యెట్లయిననేమి ? ఆ బాలఘాతకు నెందున్నను బట్టి మట్టుబెట్టి మీ పట్టిని బ్రతికించి