పుట:కాశీమజిలీకథలు-11.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

కాశీమజిలీ కథలు - పదునొకండవ భాగము

సెలవిచ్చినరీతి జేయకతప్పదు. పదుడు పదుడు పదుడని పలుకుచు నీవలకు దీసికొని వచ్చెను.

అగ్నిశిఖుడు కౌశికా! ఇదియేమి కర్మము. కాళిదాసుని మన మెప్పుడు చూచి యెఱుగము. వాని చర్యలు విపరీతముగ జెప్పుకొను చుందురు. అత డపత్నీకుడని వింటి. అయ్యో! నా శ్రాద్ధ మధ్వాన్నముగానే యున్నది. యతులకు కర్మనియమము తెలియదు. ధర్మ శాస్త్ర కర్తలు యతుల కిడుమనుట యసమంజసమని తలంచెద. ఇప్పు డేమనుకొన్నను ఫలములేదు. వానిం బిలవకున్న తాను తానని సూచించెమ. ఎట్ల యినను నాబ్దికము భ్రష్టమైనది. కానిమ్ము. కాళిదాసెందుం డెనో తెలిసికొంటివా ? యని యడిగిన శిష్యుం డిట్లనియె.

గురువరా ! అట్లనరాదు జ్ఞానులమహిమ జ్ఞానులకే తెలియును కాళిదాసెట్టివాడో యెవరికి దెలియును? పోయి విమర్శింతము రండని పలుకుచు నటగదలి యొకవీధింబడి పోయిపోయి యెదురుబడిన యొక పారుంజీరి కాళిదాసకవి యెందుండునని యడిగిరి. అతండు అగ్నిశిఖుని ఛాందస మెరిగినివాడగుట నవ్వుచు మీరతని భోక్తగా నియమిం తురాయేమి? ఔను ఆబ్దికమున మద్యమాంసములిడుట పూర్వసాంప్రదాయకమగుట వానిని బిలువవలసినదే ఆ కవి కవియిష్టములగుట బ్రీతుండగును. అతండు వేశ్యవాటికలో విలాసవతియను బోగము దానియింట నుండును. అందు బొండు. విలాసవతిని ముత్తె యిదువుగా బిలువుడు. అని యాక్షేపించుచు నతం డవ్వలికి బోయెను.

అతని మాటలువిని యగ్నిశిఖుండు సిగ్గుపడుచు, కౌశికా! మనకీ యాపద యెట్లు తప్పును. వానిని బిలిచిన నొకతప్పు. పిలువకున్న నొకతప్పు. ఇట్లిరుకున బడిపోయితి. మేమీ కర్మము. చీ! నే నీబ్రాహ్మణకులంబున నేమిటికి బుట్టితినో అని తన్ను నిందించుకొన విని శిష్యుం డిట్లనియె.

గురువరా! మీ హృదయమున నేదో యొకటి స్థిరపరచుకొన వలయును. ఒకరి నిందాస్తుతులతో మనకు బనిలేదు. జ్ఞానతీర్థుడు సామాన్యుడుగాడు. ఆయతి నీ యూర నందరు నర్చించుచుందురు. అతనిమాట వడువున గావించుచుంటిమి. తప్పైన నగుంగాక. సందియమును విడువుడు అని చెప్పి యావిప్రుని వేశవాటికకు దీసికొని పోయెను. అందు--


క. ఆయింట లేవగొట్టిన
   నీ యింటికివచ్చి లోని కేగుడు వీరల్‌
   సీయని త్రోసిన షిద్గని
   కాయంబులు కుక్కలట్లు కదలి చనంగన్‌.

కైలాసశిఖరాకార ప్రాకారములచే నొప్పు నగరంబుల వేళవధూస్త‌ నోప మర్దమానంబులగు గవాక్షంబులనుండి బయలు వెడలు నగరుసధూములచే దుర్దినమగు చుండ నందందు ద్వారదేశముల వారాం గనలు మబ్బుచాటున మెరయ విద్యుల్లతలో