పుట:కాశీమజిలీకథలు-11.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అగ్నిశిఖుని కథ

13

నియమించెను. వినమ్రుండై గురుండు యతి పరిసరంబున వసించినంత కౌశికుం డగ్నిశిఖుని శ్రోత్రియత్వాది‌ విశేషములన్నియు నుగ్గడించి వీరొక కాన్యావసరమున మీదర్శనమున కరుగుదెంచిరి యని నివేదించెను. ఓహో ! సన్యాసిని. నాతో వీరికేమి పనివచ్చినది వారి యాకారముసూడ పరమశ్రోత్రియులవలె గనంబడు చున్నారు! వారి యభిమత మోపుదునేని తీర్చువాడ. తెలియపరచు డనుటయు, చేతులుజోడించి యగ్నిశిఖుం డిట్లని యె.

స్వామీ ! మీరు జ్ఞానచక్షువులు. మీరు యెరుంగని ధర్మములుండవు, కర్మలు జ్ఞాననిరోధకములని చెప్పుదురుకాని జ్ఞానసాధనములనియే నా యభిప్రాయము. | ఇ. సు “డ్ర్‌ నట్లే చెప్పియున్నారు. నాకు మొదటినుండియు కర్మయం దాసక్తి యున్నది. యధాశాస్త్రముగా గర్మల జరుపుట కడుంగడు కష్టము. అందులకు [4 గగ్నింగిన ఛాందసుడందురు అన్యోన్య సహాయంబుకంగాని కర్మఠత్వము నెఱ శీరటోో, ఎల్లుండి మాయింట తిధిప్రయోజనము. అందులకు బోక్తలుగా నిమంత్రింప దగిన శ్రోత్రియుం డెవ్వడుం నీ యూర నాకు గనంబడలేదు. ఆబ్దికము మానవలసి వచ్చుచున్నది.


శ్లో॥ యోగీభిక్షుస్సామగో బ్రహ్మవేత్తా భాగ్యాల్లబ్దాశ్చేత్తధా భోజనీయాః

అని యున్నది మా పూర్వపుణ్యవశంబున మీరిందు నిలిచి యుంటిరి. మిమ్ము భోక్తగా నిమంత్రించుచున్నాను. అంగీకరింపవలయునని పాదంబులంబడి వేడుకొనియె.

ఆ యోగి నవ్వుచు లేవనెత్తి నీవు వేదమూర్తివి. నీ యభిలాష దీర్చుట కంటె పరమార్థములేదు. అట్లే భిక్షకంగీకరించితిని. కాని రెండవభోక్త నెవరి నిమంత్రింతువని యడిగిన నతం డిట్లనియె స్వామీ! అందులకేకదా యిన్ని చిక్కులు పడుచుంటిమి. తమ రెరింగిన వా డెవ్వడేని యుండిన వక్కాణింపుడు. అనవుడు నయ్యతి యించుక సేపాలోచించి వైదికుడా! నే నొక్కనిం బేర్కొందు. ఇట్టట్టనక వాని నంగీకరింతువే ? అని యడిగిన సరిసరి. మీ కన్న నే నెక్కుడు ప్రొజ్ఞుండనా? మీ యాజ్ఞ శిరసావహించి యట్లు కావించెద నా నతిం డనుటయు సన్యాసి యిట్లనియె.


ఆ. వె. కలడు కాళిదాసకవివరుం డీయూర
         బిలువు మతని దారసిలి ద్వితీయ
         భోక్తగా నతడు బొఱి మదీయోక్తుల
         నాదరించి భుక్తి కనుమతించు. (4)

అతనిపేరు మీరును నెరింగియుందురు. అట్లుసేయుడు పో పొండని బిల్చి యతండు లోపలికి బోయెను. ఆ మాట వినినతోడనే యగ్నిశిఖుని హృద యము ఝల్లుమనినది. ముహూర్త కాల మేమియు నొడలు తెలియలేదు. యేదియో ధ్యానించుచుండ శిష్యుండు స్యామీ! ఇ౦టికిం బోవుదము రండు. స్వాములవారు