పుట:కాశీమజిలీకథలు-11.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

కాశీమజిలీ కథలు - పదునొకండవ భాగము

యూరంతయు దిరిగి శ్రోత్రియుల శ్రోత్రియ పుత్రుల విమర్శించి పేరులువ్రాసి కొనివచ్చి గురునకు నివేదించుటయు.


సీ. ఒకని వామనుడంచు నొకని నున్నతుడంచు
            నొకని స్థూలుడంచు నొకని గృశుడు
    నొకడు వేదవిహీను డొక డసత్కులజాతు
            డొక డంగవికలు డింకొకడు మూగ
    యొకడు గోళకుడు వేరొకడు కుండకుడు నిం
            కొకడు జారజుడు మఱొకడు మూర్ఖు
    డొకడనాచారసంయుతు డొక్క_ డతివాది
            వికటదంతుడు పరివేత్త యొక్క

గీ. డొక్కడ బ్రహ్మచారి యింకొకడు కృపణు
    డొకడు సిద్ధాంతవేది యింకొకడు సుకవి
    యొకడు వై ద్యోపజీవి వేరొకడు శూద్ర
    యాజకుడని‌ నిరసించు నా గృహస్థు. (3)

అట్లతం డందరకు దలయొక వంకయుబెట్టి యంగీకరింపకున్న గౌశి కుండు మరియుం దిరిగి తిరిగి భోక్తల నేరిజెప్పిన నతం డొప్పికొనమిక వగచుచు నిట్ల నియె.

స్వామీ ! మీరీయేడు శ్రాద్ధము మానవలసినదే. ఇంతకన్న శ్రోత్రియు లీ యూరలేరు. మన యత్నమువిని యీ యూరి పాఱులు పరిహసింపుచున్నారు. వారిని మన మనర్హులని యాక్షేపించితిమని మనపై నీసుబూనిరి. ఇక నీ ప్రయత్నము విడిచి చటకశ్రాద్దము గావింపుడని నివేదించుటయు నగ్నిశిఖుండు కౌశికా ! కుబోక్తల కిడుటకంటె నీ వనిన మాటయే లెస్సగానున్నది. మరియొకటి వినుము.


శ్లో. పరిపూర్ణం భవేచ్చ్రాద్ధం యతిషుశ్రాద్ధబోజిషు

అనియున్నది. యతులెవ్వరైన నీ యూర నున్నారా? వారి గుణ దోషములు విమర్శింప నవసరములేదు. వారి నర్చించిన బితృతృప్తి కారణము చూచివత్తువే యనుటయు వల్లె యని యాపగలెల్ల నూరుదిరిగి వచ్చి యంతేవాసి యొజ్జల కిట్ల నియె

గురువరా ! ఈ యూరనున్న యతులందరు మొన్న మొన్ననే తీర్థ యాత్రల కరిగినారట. శివాలయము జ్ఞానతీర్థులను యతి యొక్కడుమాత్ర ముండెను. అతండు మహానుభావుండని జెప్పిరి. మీరు వచ్చియభ్యర్థించిన నంగీకరించునని యెరింగించుటయు నగ్నిశిఖుండు సంతసించుచు మరునాడు ప్రాతఃకాలమున నిత్య కృత్యములం దీర్చుకొని శిష్యునితోగూడ శివాలయంబున కరిగి యతీశ్వరునకు సాష్టాంగ వందనములు గావించెను. అయ్యతి నారాయణ స్మరణగావించుచు గూర్చుండుడని