పుట:కాశీమజిలీకథలు-11.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగ్నిశిఖుని కథ

11


జేరి పెట్టవలయునని తలంతురు. ఎట్టివారిని నాక్షేపింతురు. నిరుడు మంచి భోక్త లు దొరకలేదనియు బితృఘాతుకుండనైతిని, మొన్నటిదనుక నిందించుకొనుచునేయున్నారు. గడువుండగనే తెలుపుచున్నాను. ఈయేడు వ్యాసజై మినుల నియమింతురేమో

-------యుండగనే చెప్పుము. అని యుపదేశించుటయు సంతసించుచు నత డా

విషయము నాటి సాయంకాలమే దేశికునకు నివేదించెను.

ఆ మాటవిని యా జన్నిగట్టు, జౌను. కౌశికా! సద్భోక్తలముందు

-----మంత్రింపవలయును. నీ వెరింగిన వా రెవ్వరైన గలిగిన బేర్కొనుము అను

టయు, స్వామీ ! పదివేల గడపగల యీ యూర సద్బోక్త యే దొరకడా ? అయినను భోక్త ఎట్లుండవలయునో నిరూపింతురేయని యడిగిన నుపాధ్యాయుం డిట్ల నియె.


శ్లో॥ వగ్జ్యాస్‌ ప్రవక్ష్యే త్వధరోగివైరి హీనాధికాం
                గాన్‌ కితవాన్‌ కృతఘ్నాన్
     నక్షత్ర శాస్త్రేణచ జీవమానాన్‌ భైషజ్యవృ
                త్యాపిచ రాజభృత్యాన్
     సంగీతకాయస్థ కుశీదవృత్యా వేదక్రయేణాపి
               కవిత్వ నృత్యా
     దేవార్చనేనాపిచ జీవమానాన్‌ స్వాధ్యాయదా
               రాగ్నిసుతాక్షకాణాన్‌.

రోగులు, వికలాంగులు. కృతఘ్నులు, జ్యోతిషము, వైద్యము, సంగీతము కరిణీకము, కుశీదము, వేదవిక్రయణము, కవిత్వము, దేవార్చనము లోనగు వృత్తు లచే జీవించువారును, దుర్జనులను, భోక్తలుగా నియమించుటకు దగరు. అని చెప్పిన విని శిష్యుండు మహాత్మా! మరి భోక్తలకు నుండవలసిన గుణములేవని యడిగిన గరుం డిట్లనియె.


శ్లో. షండగవిచ్చ త్రిసువర్ణవేత్తా ప్యధర్వశీర్‌ష్ణో ధ్యయనేరతశ్చ
    సీదద్వృత్తి స్సత్యవాక్పూరుషై స్వెర్మాతాపిత్రోఃపంచభితవంశః

త్రిణాచకేతుడు, షడంగములు దెలిసినవాడు. అధ్యయనరతుండును, వేదార్థమెరింగి యొరులకు జెప్పదగియున్నవాడును, బ్రహ్మచారి, యజ్ఞవేత్తయు, సత్య వదనుడు, బహుపురుషాంతరములనుండి కళంకములేని ప్రఖ్యాతమైన వంశముగల వాడును భోక్తగా నియమింపదగియుండును.

శిష్యుడు - అమ్మయ్యో ! ఇట్టి సుగుణంబులన్నియు నెవ్వరియందుండును? ఇట్టివారుండుట యరుదే. స్వామీ ! భోక్త లెందరు కావలయును?

గురుండు - "సూ॥ సప్త పంచ ద్వౌవా శ్రోత్రియాన్ని మంత్రయేత్‌ " ఏడ్వుర,‌ నైదుగర, నిరువురంగాని నియంత్రింపవలసియున్నది. మన కిరువురు దొరకినను జాలును. అని చెప్పినవిని సంతసించుచు నా శిష్యుండు మరునా డా