పుట:కాశీమజిలీకథలు-11.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాళిదాసకవి భోక్తృత్వము

19

నోటితో పూత్కారము గావించినంత జల్లబడి యావంత యావంతయులేక యధా ప్రకార మాకర మొప్పుచుండెను.

అప్పు డగ్నిశిఖున కతనియం దెక్కడలేని భయభక్తి విశ్వాసము లుద యించినవి. భార్యతోగూడ నతని పాదంబులంబడి యనేకోపచారములు సెప్పికొని యెను! పిమ్మట జ్ఞానతీర్దులకు మ్రొక్కుచు మహాత్మా ! నీవు నన్ను వంచించుట కిట్లు వినియోగించితివని నిందించితిని. కాళిదాసు మహానుభావుండని యెరుగకపోయితిని అతని తేజమిప్పుడు తేరిచూడరాని కన్నులకు మిరుమిట్లు గొలుపుచున్నది. అయ్యారే యింత డెట్టి మహాత్ముడు ! వేశ్యాలోలుడన నేమో యనుకొంటిని. నేటితో మాపితరులు బ్రహ్మకూకటి ముట్టగలరని యూరకస్తుతిచేయుచుండ సన్యాసి యిట్లనియె.

శ్రోత్రియుడా! కాళిదాసకవి యవధూతవంటివాడు. ఆతనికి సంకల్ప నికల్పములు లేవు. జ్ఞానవంతులలో నిట్టివిజ్ఞాని లేడు. ఈ విషయము నా కొక్క నికే తెలియును. తక్కినవారెల్ల నతని బ్రకృతిరతుగా దలంతురు. భోజుండును డతని మహాకవి యనియే గౌరవించును కాని విజ్ఞానియని యెరుగడు. వినుము.


గ. హరి మేధమ్ములు నూరులు
    సరిహత్యలు చేసినను నసంకల్పునకున్‌
    బరమార్థవేది కంటవు
    పరికింపగ పుణ్యపాపఫలములు ధరలో (6)

మహానుభావు లున్మత్తజడమూకాజ్ఞులవలె గనంబడుచుందురు. అట్టివారి యాత్మబలశక్తి సామాన్యులు గ్రహింపజాలరు. అని యా సన్యాసి యుపన్యసింపు చుండగనే కాళిదాసకవి జపము ముగించి గది తలపు ద్రోసికొని యీవలకు వచ్చెను. అప్పు డగ్నిశిఖుండు మరియు మరియు నతని చరణంబులకు జోహారులు జేయుచు నతనియెడ మున్ను తా బొందిన వ్యామోహము నప్పుడు కలిగిన సంతోషమును వెల్ల డింపుచు బెద్దగా నగ్గించుటయు గాళిదాసకవి యేమియు మాటాడక సన్యాసి మొగము చూచి మందహాసము గావించెను.

సమయమగుటయు నగ్నిశిఖుండు యధాశాస్త్రముగా వారి నిరువుర నర్చించి సమంత్రకముగా నాబ్దికప్రయోగము నెరవేర్చెను. భుజించిన వెనుక నా భోక్త లిరువురు లాశ్రోత్రియున కుత్తమసంతానము గలుగున ట్లాశీర్వదించి తమ నెలవు లకుం బోయిరి.

అని యెరింగించి -