పుట:కాశీమజిలీకథలు-11.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

కాశీమజిలీ కథలు - పదునొకండవ భాగము

గొట్టినది. కానిమ్ము వంటకు సహాయమెవ్వరును రాలేదా ? యని యడిగివ నప్పా ఱుత యిట్లనియె.

శ్రోత్రియులు మిమ్మేమనుటకుంజాలను భోక్త లకై యూరంతయు వెదకించి తిర. ఎవ్వరును బనికిరారని నిరసించితిరి. అందరకు మనపై నీసుగానున్నది. అది యట్లుండ గాళిదాసకవిని భోక్తగా బిలిచితిరట. అతడు బ్రాహ్మణకులములో లేడట. మన యింటి కెవ్వరును రారట. పాఱుల వీధుల గుజగుజలాడుచున్నారు. చుట్టములుగూడ రారైరి. కానిండు యిప్పుడేమనుకొనినను బ్రయోజనములేదు. వంటయైనది. మీ యనుష్టానము దీర్చికొండు. శిష్యులే సహాయము చేయుచుండిరని చెప్పినది.

ఆ మాటవిని దిగులుపడి యతండేదియో చెప్పబోవునంతలో నంతేవాసి వచ్చి కాళిదాసకవి వచ్చియున్నాను. స్నానము చేసెడునట. నీరుకాగినదా? అని చెప్పిన నగ్నిశిఖుండు తొందరగా వాకిలికిం బోయి యందున్న కవికి నమస్కరిం చుచు దోడ్తెచ్చి యతని కుపచారములు చేయ శిష్యుల నియమించెను.

కాళిదాసకవి శిష్యులవెంట నూతియొద్దకుంబోయి యెసరువలె గ్రాగిన వేడి నీళ్ళబిందెల శిష్యులు పధానపటముతో నెత్తిపై యభిషేకము వేయ దృప్తిగా స్నానము జేసెను. వేడిబిందెలంటుటచే శిష్యుల కరతలంబులు కమిలినవిగాని యా కవికి వేడి యించుకయు సోకినదికాదు అతండట్లు తీర్థమాడి మడిపుట్టమ్ములం గట్టుకొని యొడలెల్లవిభూతిబూసి జాముదనుక నన్ను పిలువవలదని చెప్పి యొక గదిలో గూర్చుండి జపము చేసికొనుచుండెను.

అగ్నిశిఖుండు బ్రహ్మయజ్ఞ పితృతర్పణాదినిత్య విధుల నిర్వర్తింపుచుండ నంతలో జ్ఞానతీర్థు లరుదెంచిరని శిష్యుడు చెప్పుటయు నతండాయతికి వందనముచేసి తీసికొనివచ్చి విష్టరోపవిష్టుం గావించెను. సన్యాసి కాళిదాసకవి వచ్చెనాయని యడిగిన గృహమేధి ఆ వచ్చిరి. గదిలో జపముచేసికొనుచున్నారని చెప్పెను. సమయమైనది. లోపలికి బోయి పిలిచికొనిరమ్ము పొమ్మనిచెప్పిన విప్రుడు మెల్లన తలుపుతీసి లోపలికేగి చూచెను. అమ్మహానుభావుండు బాహ్యప్రచారములేక యాత్మయం దీశ్వరసన్ని ధానము గల్పించుకొని ధ్యానించుచుండుటఁ బట్టి గట్టిగ నతం డెంతపిలిచినను బలుకడయ్యె. పిమ్మట దాపునకు బోయి కవీంద్రాయని పిలుచుచు మెల్లగా నతనియొడలిపై జేయిడియె. క్రాగిన యినుపకమ్మివలె దగిలినతోడనే యతని చేయి భగ్గునమండి చర్మమూడినది.

అమ్మో యని యఱచుచు చేయి లాగుకొనియెను. ఆ రొద విని యా కవి కన్నులు దెఱచి చేయి విదళించుచు బాధపడుచున్న యా జన్నికట్టుచేయి పట్టుకొని