పుట:కాశీమజిలీకథలు-11.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

కాశీమజిలీ కథలు - పదునొకండవ భాగము

మనల వంచించుటకే యాసన్యాసి యిట్లుచెప్పెను. నాకువీని నిమంత్రింప నిష్టములేదు. ఇంటికిం బోవుదమురమ్ము, అనవుడు శిష్యు డిట్లనియె.

ఆచార్యా ! మీరొక మాటపై నిలువకున్న నేమనదగినది! ఆబ్దికముమాట యటుండనిండు. యతీశ్వరునితో నాడితప్పుట కడుంగడు పాపము. మీరితని బిలువ కున్న నా యతిరాడు. తద్దినము వృధా పాడగును ఓర్పు వహింపుడు. అని జనాంతిక ముగజెప్పి బాలా! వారితోమాటాడ నత్యవసరము గలిగియే వచ్చితిమి మారాక వారికి నివేదింపుము. నీకు మంచి విటశిఖామణి లభించునని యాశీర్వదించుటయు, నబ్బాలిక ముసి ముసి నగవులతోపోయి కవివరున కత్తెరం గెరిగించినది.

ఆతండవ్వార్తవిని సత్వరము మేడదిగివచ్చి ద్వారదేశమున నా భూసురులం గని సీధురసవాసనలు నలుదెసలం ప్రసరింప నాతో మీకేమి పనియని యడిగెను. ఆ విప్రు డతనిజూచి యేవగించుకొనుచు ముక్కుమూసుకొని యేమియు మాటాడడయ్యె. అప్పుడు శిష్యుం డప్పారుని వృత్తాంతమంతయుం జెప్పి నెల్లి వీరింట నాబ్దికము. జ్ఞాన తీర్దులవారి నొకభోక్తగా నిమంత్రించిరి. రెండవభోక్తగా మిమ్ము నిమత్రించుమని వారే చెప్పియున్నారు. అందులకే మేమిందువచ్చితిమి. నావుడు సరియే అట్లేవత్తుము పోపొండని పలికి యిల్లు తెలిసికొని యక్కవితిలకుండు లోపలికిం బోయెను. ఆ శ్రోత్రి యుం డతనిజూచి కౌశికా! ఈతడేనా కాళిదాసకవి? వీనియందు బ్రాహ్మణ వర్చస్సు ఇంచుకయులేదే? కవీంద్రుల గ్రంథముల మన్నింపవలసినదేకాని వారి చర్యలు స్తుతిపాత్రములుగావు అయ్యయ్యో! వీడా మనకు భోక్త. మన కర్మము కాలినట్లే యున్నదని విసిగికొన గౌసికుం డయ్యగారు! మీ రేమియ నాలోచింపవలదు. మహా త్ముల చరిత్రలు కడు విచిత్రములు. ఇంటికిం బోదమురండని దేశకునితో గూడ కౌశికుం డింటికింబోయెను.

అని యెరింగించువరకు కాలాతీతమైనది. తరువాతకథ పై మజిలీయందిట్లు యుండునని చెప్పదొడంగెను.


251 వ మజిలీ

కాళిదాసకవి భోక్తృత్వము

అగ్నిశిఖుండు శ్రార్దదివసంబున నిత్యకృత్యంబులం దీర్చుకొని వెండియు భోక్తల నిమంత్రించు నిమిత్తము బయలుదేరి శివాలయంబున కఱిగి తొలుత యతీశ్వ రునకుం జెప్పి తరువాత విలాసవతీభవనంబున కరిగెను.

వాకిట బాచిచేయుచున్న దాదినిజూచి ఓసీ ! కాళిదాసకవి లేచినా ? అని యడిగిన నది నవ్వుచు వారిప్పుడే లేతురా ? రాత్రియెల్ల నిద్రమాని వేకువజామున పండుకొందురు. ఒక్కొక్కనాడు మిట్టమధ్యాహ్నముదనుక లేవనేలేవరని యుత్త