(13)
శశాంకమకరాంకుల కథ
97
సఖుఁడొకఁ డడివిలో పాసితుడై యున్నవాడు. నేనిక్కడికి వచ్చి నిద్రపోయితిని. చాలసేపయినది. అతం డేమయ్యెనో తెలియదు. జలములు తీసికొని పోవలయును. నా శిబిర మేమైనదని యడిగిన నవ్వుచు నాసుందరి యిట్లనియె. పుత్రా ! నీ యాత్ర వేమిటికి వినుము. నీమిత్రుని నిమిత్తము దూతలం బుచ్చిరి. ఇక్కడికే రాఁగలడు. చింతింపకుమని పలుకుచుండగనే యతండు లేచెనను వార్తవిని కిన్న రదత్తుం డచ్చటి కరుదెంచెను.
ఆ నృపతిని గురుతుపట్టి రాచపట్టి తండ్రీ ! నాసఖునొద్దకు జలంమంపితిరా ? అతండేమయ్యెనని యడుగుటయు నతండు వత్సా ! నీకు వానియందుఁగల ప్రీతి నీయందు వానికి లేదుగదా? మరౌతువోయి వానిని వెదకిపట్టుకొని దప్పితీర్చి నీ మిత్రుఁ డందున్న వాఁడు రమ్మని యెంత చెప్పినను వినక వేరొక తెరువునఁ బోవుటకు బ్రయత్నించెనట అప్పుడు మారౌతు నీవొక్కరుఁడ నీయడవిలో నడువలేవు. ఈ గుఱ్ఱముపై కూర్చుండుము. అడవిదాటించెదమని చెప్పి యతనిఁ దనవారువముపై నెక్కించుకొని వేరొకమార్గమున నరణ్యముదాటించివచ్చిరి. ఇదియే నిమిత్రవృత్తాంతము నీవువానికొరకుఁ జింతింపఁబనిలేదని చెప్పిన శంశాంకుడు అవును. నన్నుఁగృతఘ్నుగాఁదలచి యట్లు చేసెను. సఖుఁడాపదఁ జెందియుండ నేనఁటఁ బోక వేరొకరిం బనిచిన ననుమోదించునా? ఇది నాతప్పే. దేవా ! మీరునాకుఁ బ్రాణదానముఁ గావించిరి. నా జీవితాంతముదనుక మీకుఁ గృతజ్ఞుఁడనైయుండెద నిఁకపోయివచ్చెద ననుజ్ఞయిండని ప్రార్ధించిన నవ్వుచుఁ గిన్నరదత్తుం డిట్లనియె
శంశాంకా ! నీ యంకములన్నియు సార్వభౌమత్వము సూచింపుచున్నది. నాకు సంతతిలేదు. నిన్నుఁ బుత్రునిగానెంచి రాజ్యము నీ కిచ్చివేసితిని. నేను వృద్ధుఁడనగుట రాజ్యంబేలఁ జాల ప్రాయము చిన్నదైనను నీ బుద్దిబలము పెద్దది. నీ గుణములువిని ప్రజలు నిన్ను రాజుగాఁ గోరికొనిరి. ఆ తారావళియే నీకుఁ బట్టమహిషి కాగలదు. స్వస్థుండవై రాజ్యం బేలుకొనుమని నయకళా కౌశల్యముతోఁ జెప్పిన నతండంగీకరింపక నెన్నియో ప్రతికూల వాక్యములం జెప్పెను.
రాజు వాని యుక్తులన్నియు ఖండించి యతని నిరుత్తరుంజేసెను. శంశాంకుం డప్పటికేదియుఁ దప్పించుకొను నుపాయంబుఁ గానక పిమ్మట విచారించుకొనవచ్చునని యంగీకారము సూచించెను.
ఉత్తమ పుత్రుండు లభించెనని యా నృపోత్తముం డధిక కౌతూహలముతో నొప్పుచుండ నొండురెండు నాళ్ళరిగినంత నాధరా కాంతుఁ డాకస్మికముగా సర్పదష్టుండై ప్రాణములు విడుచుసమయమునఁ బ్రకృతి వర్గమును కానించి గన్నీరుఁ కులపుట తడే నా కొమురుడు. సకల ద్యా పరిపూర్ణుడు. రదుడగుట న్యాయంబన రాజ్యం చేసింది.. నన్ను. గర సౌఖ్యను లండఁగలరని చెప్పుచునే నిశ్చేష్ఠకు చెయ్యను.