96
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
ప్రయాణంబుల శోభావతియను బేరంబరగు తన రాజధాని కరిగెను. సామంతాది పరిచారకులు రాజనుమతిని శశాంకుని యందలముకూడ శద్దాంతమందిరమునకుఁ దీసికొనిపోయి యందు వేరొక శయ్యపైఁ బవ్వళింపజేసిరి అప్పుడు కిన్నరదత్తుఁ డత్యంత సంతోషముతోఁ దన పట్టమహిషి కక్కు మార శేఖరుంజూపుచు దేవీ ! యీతండొక మహీదేవేంద్రుని కుమారుఁడు. వీనిపేరు శశాంకుఁడు వీని సౌందర్యముకన్న విద్యలును విద్యలకన్న సుగుణములును స్తోత్రపాత్రములై యున్నయవి. మేము స్వయముగాఁ బరీక్షించి చూచితిమి. దైవికముగా వీఁడు దారితప్పి మా సేవలోఁ జేరికొనియెను. అనపతుల్యమగు మనకు వీని దైవమే తీసికొనివచ్చి యిచ్చెనని సంతసించుచు నా రాజ్యము వీని యధీనము సేయ నిశ్చయించితిని. వీఁడే మనకుఁ బుత్రుఁడు. నీవు మాతృ విహీనయైన నీయన్నకూఁతురు తారావళిఁ బెంచుచుంటివిగదా. ఈ సుగుణనిధికిఁ దారావళినిచ్చి పెండ్లిఁ జేసికొనుము. దానంజేసి నీ పెంపు సాద్గుణ్యము కాఁగలదు. ఇన్నియు నాలోచించియే యిప్పనిఁజేయఁ బూనికొంటిని. అట్లయిన నిరువుర రూపములు సఫలములగునని చెప్పిన విని సంతసించుచు నారాజపత్ని యందుల కంగీకరించి యా కుమారునికి స్వయముగా నుపచారములు సేయఁదొడఁగినది శశాంకుఁడు తల్పంబునఁ బండుకొని నడుమనడుమ హా రూపవతీ ! బాపురే ! సఖీ ! రూపవతీ; యని పలవరింపుచుండెను రాజపత్ని యాశ్చర్యముగా వినుచు నిట్లు పలవరింప నేమిటికోయని వితర్కింపుచుండెను.
అంత నాలుగవనాడు శశాంకునికి దేహస్మృతికలిగినది. కన్నులందెరచి యెదురునున్న రాజపత్నింజూచి విభ్రాంతిఁ జెందుచు అమ్మా ! నీవెవ్వతెవు ? నే నిచ్చటి కెట్లువచ్చితిని? ఇది కలయా? నిజమా? ఇంద్రజాలమా ! ఎరింగింపుమని యడిగిన నామె యిట్లనియె.
వత్సా ! నీవునన్నుఁ జూచినతోడనే యమ్మా ! యని చీరితివిగదా ! నీకు నేను దల్లినే. నీవునాకుఁ బుత్రుండవు ఇదిగో తారావళి నీభార్య. నీయంద మూరక పరీక్షించుచున్నది. నీవు చాల నలసితివి. మధురా హారములఁ దృప్తుండవుగమ్ము. నెమ్మది నంతయుం జెప్పెదనని పలికిన నతం డున్మత్తుండువోలె నొం డెరుఁగ నేరక తద్దత్తములైన మృష్టాన్నముల సంతృప్తివడసి విశ్రాంతిబొందిన పిమ్మట నాత్మీయవృత్తాంతమును దలంచుకొనుచు నోహో! నేనడవిలో నుంటినికాదా? అవును రూపవతికి దాహముఁ దెచ్చి యిచ్చుటకై యొక రాజుగారి శిబిరమునకు వచ్చితిని. తరువాత నేమిజరిగినదో జ్ఞాపకములేదు. అయ్యో ! రూపవతిమాట యేమైనది. నేనిందు జాగుచేసితినిగదా ! అని లన లేచి యెసులకుఁ బడుగిడంఁ దొడంగెను. గన్న గదత్తుడు వాసికధ యంతయు భార్య తెలింగించి యొన్న డు కావున నా చర్యలన్నియు గ్రహించుచు నా యోషామణి కూసి కడ్డము వోయి చిన్న ఛాతం నిలువలు ఎక్కడి3 బోయెనవు అని యడిగిన నతడిట్లనియె. అమ్మా: నా