94
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
పోవలయు నేమిచేయుదును. వచ్చినదారియేదియో పోవలసినదారి యేదియో తెలియకున్నది. అన్నన్నా ! అని తలంచుచు నొకదారింబడి కొంతదూరము పరుగెత్తి నిలువంబడి యిది వచ్చిన త్రోవకాదు. మరియొకటి అని వెనుకకుఁదిరిగి మరికొంతదూరము పరుగెత్తినది. ఆధారియు గురుతు తెలిసినదికాదు. కొంచెము దూరముపరుగెత్తి నిలువంబడి రూపవతీ ! యని పెద్దయెలుంగునం బిలుచుచు జెవియొగ్గి ప్రతివచనంబు వినరామి నిఁకయెక్కడి రూపవతి ? ఈపాటి కేమృగమో భక్షించిపోవును. సీ ! సీ ! నావంటి బుద్దిహీనురా లెందునులేదు. ఇంచుకయు నాలోచింపక యప్పటికిఁ దోచినట్లు చేయుచుందును. అందులకే ముప్పులకెల్ల కారణమైతిని. నీరుండు తా వెరుగునట్లే పరుగిడి వచ్చితిని. దాపునఁ గూర్చుండి విసరుచు మోముఁదుడుచుచు మెల్లగ లేవనెత్తి తీసికొనిరాక నూరక యీరాకఁ గావించితినని పెక్కుగతులఁ దలపోయుచు నొక చెట్టెక్కి నలుమూలలు పరికించినది.
అప్పుడు దూరములో నొకదెస వేటకాండ్ర సందడి వినంబడినది. ఆ దెస గురుతు చూచుకొని యా పాదపము దిగి యమ్మగువ తిన్నగా నాదిక్కునకు నడువఁ దొడంగినది. పోయినకొలఁది యాధ్వనులు సమీపించుచుండెను. అప్పుడు వడివడిఁ బోయి యప్పడతి జనసమూహములోఁ జేరినది. విశాలమగు నెడారిలో గుడారములు పెక్కులు వేయఁబడియున్నవి. చుట్టును సైన్యము నిలువంబడి యున్నది. గజతురగ స్యందనాదులం బయనమునకు సన్నాహము సేయుచుండిరి. అట్టి సేనానివేసముఁ జేరి యా నారీ రత్నము జలము జలము అని యరచినది. అట్లుపొమ్ము. అనికొందరు ప్రత్యుత్తర మిచ్చిరి. ఆ చిన్నది కొంతదూరము లోనికింబోయి అయ్యా ! దప్పికొట్టి నామిత్రుఁడొక డీయడవిలో బడిపోయెను. వేగము మంచినీ రెండున్నదో తెలుఁపుఁడని పెద్ద యెలుంగునఁ బలికెను.
ఆ ప్రాంతమందలి శిబిరములో వేటకాండ్రు చుట్టునుబలసి వేటమాటలు సెప్పుచుండ వినోదముగా వినుచున్న కిన్నరదత్తుఁడను నృపాలుండు దైనముగా నా యార్తధ్వనిని విని యెవ్వఁడో దాహమని యరచుచున్నాడు. వాని నిచ్చటికిఁ దీసికొని రమ్మని యొకపరిచారకు నంపెను. వాఁడు వోయి యా రాజపుత్రికను దీసికొని వచ్చి రాజునెదుటఁ బెట్టెను. తదీయ ముఖవిలాసములు రూపరమణీయమును జూచి వెఱగుపడుచు నయ్యొడయుడు బాలుఁడా ! నీ వెక్కడివాడవు? ఇక్కడి కేమిటికి వచ్చితివి ? ఈ దాహము పుచ్చుకొని యిందు విశ్రమించి నీ వృత్తాంత యెరిగింపు మని యడిగిన మాటలు తడఁబడఁ గళావతి, దేవా ! ఇది నాకు విశ్రమింప సమయము కాదు. బ్రాహ్మణ కుమారుల మిరువురము కాశీలో విద్యాభ్యాసముజేసి యింటికిఁ బోవుచు నీ యడవిదారిం బడితిమి నా మిత్రుడు వరాహపాతితుండై మూర్చ మునిఁగి యున్నవాఁడు. వానికి దాహము దే నరుదెంచితిని. ఈ యడవిలో నెందును జలములు దొరకినవికావు. ఆలస్యమైన నతఁడు బ్రతుకఁడు నా పేరు శశాంకు రందురు. దేవర