పుట:కాశీమజిలీకథలు-06.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

88

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

లేదు. ఎందువసించితివి ? పిల్ల లెందరు? ఏమిచేయుచుంటివి. మన సహాధ్యాయుండు విద్యత్కేసరికథ యేమైనం దెలిసికొంటివా ? అన్ననా నిన్నుఁజూచినంత మనము గాశిలోఁ జేసిన యల్లరులు జ్ఞాపకము వచ్చుచున్నవిగదా ఆహా యౌవనమునకుఁ జాలిన సంతోషసమయము మరియొకటిలేదని పూర్వోదంతములు గొన్ని ముచ్చటించుటయు నతండు నిట్టూర్పు నిగుడింపుచు నిట్లనియె.

వయస్యా ! నీ వనినట్లు బాలభావంగల సంతసమెప్పుడును గలుగదు. ఇప్పటి నాస్థిని మనుష్యమాత్రుని కెవ్వరికిఁ గలుగదని చెప్పగలను. నేను గడు పాపాత్ముండ. నా యుదంతమును వినిన నీవును జింతింతువు. పోనిమ్ము. నీకుఁ బిల్ల లెందరు? ఇప్పుడీపిల్ల నెవ్వరికిచ్చితివి ? నీ వదృష్టవంతుఁడవు. నీ వృత్తాంతముఁ జెప్పుము. విని నా శోక ముపసంహరించు కొనియెదనని పలికిన నతండిట్లనియె.

మిత్రమా ! నా వృత్తాంతము బాగుగానే యున్నది. పిమ్మటఁ జెప్పెదను. నీ వేదియో యిక్కట్టుఁ జెందినట్లు తోచుచున్నది. నీ కధ వినుఁదనుక నా మనసు పరితపించుచున్నది. నీ వార్త కన్న నాకీ యుత్సవము పెద్దదికాదు. వేగ నుడువుమని నిర్బంధించుటయు నతండు తాను గాశినుండివచ్చి ధర్మపాలనృపాలు నాశ్రయించుటయుఁ బెండ్లియాడుటయుఁ బుత్రిక జనించుటయు వివాహసమయంబున నది నదిలోఁబడి మృతినొందుటయు లోనగుకథ యంతయుం జెప్పి యప్పండితుని శోక జలరాశిలో ముంచివై చెను.

ఔరా ! విధి చలపట్టి యెట్టి యిక్కట్టుఁ గలుగఁ జేసెను. అన్నన్నా ఎట్టిసంతోషము చింతలపాలయ్యెను. అని సోమభట్టారకుండు విచారింపుచుండ వారించుచు యజ్ఞదత్తుండు పోనిమ్ము? ఆ తగవు తలఁపవలదు. పెండ్లియింటఁ గంటఁ దడిపెట్టరాదు. నీ యుత్సవము నా యుత్సవము కాదా ! ఎక్కడి సంతానము ఎక్కడి సుభము వీరవలన మనమానందింపఁ దలంచుకొనుట -------------- జలంబుఁగ్రోలఁ దలచినట్లే. చాలు. జాలు. అని పలుకుచు ఏమీ ! పెండ్లికూతు రెందున్నది: రప్పింపుముఁ చూచి యానందించెదంగాక యని పలకగా నతండు దిగులుతో నందున్న శిష్యునింజీరీ పెండ్లికూతుం దీసికొనిరమ్మని సంజ్ఞజేసెను.

అయ్యంతేవాసి లోనికిఁబోయి వచ్చి స్వామీ ! పెండ్లికూఁతు రెంతఁజెప్పినను సిగ్గుచే నిక్కడికి రాకున్నది. గడియ తాళవలయునని చెప్పిన ధరణ మరి యెవ్వరు కారు. నా మిత్రుఁడు చూదవలయు. రావచ్చునని ఇప్పుము. అని మకల నతని లోపలికని పెను. ఆ శిష్యుఁడు పోయి కొంత సేపటికి వచ్చి గురుసితో రహస్యముగా స్వామి: పెండ్లి కూతు రెండో కాగినది. ఒకదనను గనంబడినదికాదని చెప్పెను. అప్పుడు సోమధట్టారకుఁడు లానే లోనికి Dod లు వెదకెను.