Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యవతి కథ

87

ఆ యాప్తుం డా జీకటిగదిలోనికిఁ బోయి తడిమికొనుచు నలుమూలలు దిరిగి దిగ్భ్రమఁజెంది సత్యవతియున్న గంప యెందున్నదో తెలిసికొనలేక గుప్తవర్మయున్న గంపయేయని యనుకొని యా గంప యెత్తికొనివచ్చి పెండ్లి పీటలయొద్ద దింపెను. పెండ్లి కూతురు తలవాల్చికొని యుండుటచే నేది యెవ్వతియో నిరూపింప నవసరము లేకపోయినది.

పిమ్మట బురోహితుండు విధి ప్రయుక్తముగా భట్టారకునిచేఁ గన్యాదానము గావింపఁజేసెను. విద్యాభాస్కరుండు పరమ సంతోషముతో బెండ్లి కూతురి మెడలో మంగళసూత్రమును గట్టెను. వధూవరు లొండొరులపైఁ దలంబ్రాలు పోసికొనిరి. అట్టి సమయమున సోమభట్టారకుఁడు గుప్త వర్మ ముఖముచూచి అయ్యో ! ఇదియేమి మోసము సత్యవతిని దీసికొనిరమ్మని చెప్పిన దీనినే తీసికొని వచ్చెనేమి. అని తల్ల డమందుచు లేచి యా చీకటి గదిలోనికిం బోయి తడిమి సత్యవతిఁ జూచి నీవిందే యుంటివా? తల్లీ యని పలికిన నక్క లికి నన్నెవ్వరు తీసికొని పోలేదని యుత్తరము చెప్పినది.

ఆహా ! దై వయత్నముగాక మనుష్యయత్న మొక యత్నమా? ఇట్లెరిగియు విద్వాంసులును మోహమందుచున్నారు. సత్యవతికింకను వివాహయోగ్యదశ రాలేదు కాఁబోలు. ఈ ముహూర్తమున సత్యవతి మెడలో భాస్కరునిచేత మంగళసూత్రముఁ గట్టించలేకపోతినిగదా ! అయ్యో ! పాపము గుప్త వర్మ కన్యాకృత్యము లన్నియు నేరుపుగా నభినయించుచున్నాడు. నా కేమియు ముపయోగించినది కాదు అని పెక్కు గతులఁ తలపోయుచు విధిలేక చేయవలసిన కార్యములు సేయుచు నాలుగు దివసములు గడిపెను. అతనికి మనసు మనసుగా లేదు ఉత్సవము లాపత్సమయములైనవి. అతడు మాటాడుటయు, నవ్వుటయు, బిల్చుటయు నెరుంగడు. విద్యార్థులే యన్నిపనులు సవరించుచుండిరి. ప్రాణసమమైన పుత్రిక యన్యాధీన యయ్యెనని చింతించుచున్నాడని బంధువులు తలంచిరి. గుప్తవర్మకుఁ గృతవర్మకుఁ గన్యాదాతలకుదప్ప నా రహస్య మెవ్వరికిం దెలియదు. నాకబలియైన తరువాత సోమభట్టారకుఁ డొకచోటఁ గూర్చుండి ఏదియో ధ్యానించుచుండ నొక శిష్యుడువచ్చి స్వామీ ! యజ్ఞదత్తుండను బ్రాహ్మణుండు భార్యతోఁగూడఁ గాశికిఁ బోవుచు నిచ్చటికి వచ్చి యున్నవాఁడు ఆయన మీకు సహాధ్యాయుడట. మిమ్ముఁజూచి పోవలయునని చెప్పుచున్నాడు. వాకిటఁ నున్నాడని చెప్పుటయు దుఃఖము మరచి సంతోషముతో లేచి వాకిటకుఁబోయి యజ్ఞదత్తుంగాంచి యోహోహో !ప్రాణమిత్రుఁడేయని పలుకుచు గాఢాలింగనముఁ జేసికొనియెను.

అతండును నుపళ్లేషపూర్వకంగా సంప్రీతిని వెల్లడించెను. ఒండొరుల సంతోషములు దెలుపుకొనిన పిమ్మట సోమభట్టారకుండు మిత్రమా? కాశినుండి నేను నీకంటె మందుగనే యింటికి వచ్చితినిగదా ? తరువాత నీకథ యేమియుఁ దెలియుట