పుట:కాశీమజిలీకథలు-06.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

80

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

మరిగి యే క్షేత్రమందైనఁ గాలక్షేపముఁ జేయుచు శరీరయాత్ర జరుపు కొనియెదము. అని పలికినఁ గన్నీరు విడుచుచు నక్కన్నెక లిట్లనిరి.

తండ్రీ ! మా వయస్య లిరువురు బ్రతికియుండిరని మా హృదయములు సూచించుచున్నవి. ఎప్పటికైనను వారు వెడలిరాగలరని మా నమ్మకము. అట్టి స్వప్నములు మాకువచ్చుచున్నవి. మీరు చింతింప వలదని యూరడించుటయు నతండు తత్పరిజ్ఞాతృ వాక్యములకుఁ దలయూచుచు అమ్మా ! కళావతీ ! చచ్చినవారెన్నడైన బ్రతికివత్తురా ? పోనిమ్ము ఇంతియే సుఖము పెట్టిబుట్టితిమి. మేము పోవుటకు మీ తండ్రి యనుమతింపఁడు. మే మెప్పుడో చెప్పకయే లేచిపోయెదము. తరువాత నీవు చెప్పవలసిన మాటలం జెప్పుమని యేమేమో యుపన్యసించెను. దేశాంతర మరుగవలదని వారిరువురును మాటలకుఁ బ్రతికూలముగాఁ జెప్పిరి.

ఆ రాత్రి యజ్ఞదత్తుండు భార్యతోగూడ నా బాలిక లిరువురు మేల్కొనక పూర్వ మా యిల్లు వెడలి యెందేనిం బోయెను. మరునాఁడు ప్రాతఃకాలమునలేచి గురుదంపతులం గానక పరితపించుచు నా బాలిక లిరువురు నాలోచించుకొని యా దివసము రాత్రియే యీ వీడు విడచి యన్యదేశ మరిగిరి. ఎట్టివారికిని విధిలిఖితము లతిక్రమించుటకు శక్యమా ? వారరిగిన యొండు రెండునాళ్ళకు ధర్మపాలుండు యజ్ఞదత్తు నూరడించు తలంపుతో వారింటికరిగి తలుపులు మూయంబడి యుండుట జూచి వెరగుపడుచు గొండొకతెరవున లోనికింబోయి యందెవ్వరింగానక భయసంభ్రమములతో వృషాంకుని రప్పించి యతనివలనను వారిజాడఁ దెలియక యూరెల్ల వెదకించయుఁ నడిగియు జాటించియు వారివృత్తాంత మించుకయుఁ దెలిసికొనలేక నత్యంత దుఃఖాక్రాంతస్వాంతుండై యోలగంబున మంత్రులతో నిట్లాలోచించెను.

రాజు — అమాత్యులారా ! యజ్ఞదత్తుని వృత్తాంతము మీ రెరింగినదియే కదా? అతండు పుత్రికాశోకంబునఁ బొగులుచుండ నాగపు మఱచుటకై రూపవతినిఁ గళావతిని నందుండ నియమించితిని. ఇప్పుడు మనతోఁజెప్పకయె వారినెచ్చటికో తీసికొనిపోయె నిదియేమికర్మము.

హితవాది - దేవర యాలోచించకయే చేసితిరి. నెట్టిప్రాజ్ఞునకును సమానవస్తుహాని యందసూయ జనింపకమానదు. అతండు వారి కిప్పుడేదియేని వెతఁజేసెనని యూహింప నగుచున్నది.

ధర్మవాది — కన్నులారఁ జూడక నిందమోపరాదు వారిని వెదకి తెప్పించి నిజము తెలిసికొనుట కర్జము.

వృషాంకుడు - దేవా ! హితవాది పలికినదే తధ్యము. ఆబాలికలు ధరించు తెల్లబోవుదురు? తమ బ్రాహ్మణ హృదయమ గుద్యోగింపదు,