Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

72

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

అంతఁగొంతకాలమునకుఁ దన్నాశ్రయించియున్న కమలా సరస్వతు లేకమై మూ ర్తీభవించిరో యనం యజ్ఞదత్తున కొక్కకన్యారత్నముద్భవించెను. అబ్బాలికా వతంస బవ్విద్వాంసుని హృదయమునకు మోహలతాపాశమై బంధించినది. అతండు మురియుచు నా శివునకు జాతకర్మానంతరమున శీలవతియని నామకరణము వ్రాసెను.

ఒకనాఁడు ధర్మపాలుని పట్టమహిషి యశోద పతియనుమతి వడసి యనేక మణిభూషావిశేష పారితోషకములతో యజ్ఞదత్తు పుత్రికనుంజూడ నరిగి రత్న కళికవలె మెరయుచున్న యప్పాపంజూచి వెరఁ గందుచు నెత్తుకొని ముద్దు పెట్టుకొని తనివిఁదీరని వేడుకతోఁజూచుచు సురూప కిట్లనియె.

సాధ్వీ ! నీయదృష్టము మిక్కిలి స్తుతిపాత్రమైయున్నది గదా? మేనకవలెఁ ద్రిలోకాభిరామయగు ముద్దులపట్టిం గంటివి ! మావంటి నికృష్టుల కిట్టియదృష్టము పట్టునా? యని యేమేమో యపత్యాభిలాషతో ముచ్చటించిన సురూప, దేవీ ! నీవీ యానందము శీఘ్రకాలంబులో ననుభవింపఁగలవు. ఈ పట్టిం దీసికొనిపోయి మీయింటం బెట్టుకొని పెంచుకొనము. మేము నీవారముకామా యని యామెమనసు నిండుపరుప నుడివి యనుతాపము వారించెను.

రాజపత్ని యామాట పాటించి అమ్మా ! నీవు పతివ్రతవు. నీమాట రిత్తవోవదు. నీవనినట్లీబిడ్డ నాబిడ్డయే. నీవీబాలికతోవచ్చి కొన్నిదినములు మాయింట నుండుము. అని పలికిన యప్పుడే పండితపత్నిని పుత్రికతోఁగూడ తన శుద్ధాంతమునకుం దీసికొనిపోయి యా బాలికను సంతతము తనయురమునం బెట్టుకొని ముద్దాడుచు మూత్ర పురీషాదుల నేవగించుకొనక కొన్ని దినములు తత్సంరక్షణ వ్యాసక్తితోఁ గడపి పెక్కుకానుకలతో వారి నింటి కనిపినది.

తత్సంపర్కవిశేషంబున ననపత్యతాదోషంబువాసి యా సీమంతినీ రత్నము వెంటనే యంతర్వత్నియగుటయు నవ్వార్త పట్టణమంతయు వ్యాపించి వారుల నానందసాగరమున ముంచినది. శీలవతీ లాలనావిశేషంబునంజేసి రాజపత్ని గర్భవతి యయ్యెనను వార్తవిని యప్పట్టణంబున ననపత్యుండగు ధర్మపాలుండను వర్తకుం డొకనాఁడు యజ్ఞదత్తునొద్ద కరుదెంచి వినయ వినమితో త్తమాంగుఁడై భార్యాపుత్రికలతో నతనిఁ దన యింటవచ్చి కొన్నిదినంబు లుండుమని మిక్కిలి ప్రార్ధించాను.

యజ్ఞదత్తుం దందులకియ్యకొనక వారినే తనయింటికివచ్చి యభీష్టసిద్ధిం బొందుడని నియమించుటయు ధనపాలుం డనుమోదించి శుభముహూర్తంబునఁ దనభార్యను వచ్చిన సూక్ష్మకై వారింటి కనిపెను, వైశ్యపత్నియు దాదియుంబోలె శీలవతి సుపకాలించునులు సేవఁగాదించి యింటికరిగింది. తచర్చనావిళే మట్టితో పుడే సందరినవార్త పట్టణంబంతయు వ్యాపిందినవి. అవక దాలికామణి. సిగర మట్టియు నప్పట్టణ వాస్తవ్యుండు వృషాంకంగా వాలి ప్రదకుంచనపత్యుఁ