పుట:కాశీమజిలీకథలు-06.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

శీల కళా విద్యా రూపవతుల కథ

71


శీల కళా విద్యా రూపవతుల కథ

సకల సంపద్విశాలాభిరామంబై విశాలయను పురవం బొండు ధరామంనంబగుచు విరాజిల్లుచుండు. అప్పురంబు రాజధానిగాఁజేసికొని ధర్మపాలుండను నృపాలుండు ప్రధమ దిక్పాలుని వైభవముతో రాజ్యము సేయుచుండెను. ఆ పుడమిఱేఁడొక నాఁడు కొల్వుకూటం బలంకరించి విద్వద్గోష్టి నలరుచుండ యజ్ఞదత్తుండను విద్వాంసుం డరుదెంచి యా ఱేనిచేత నర్చితుండై యాశీర్వచనముల గావించెను.

దివ్యతేజస్సంపన్నుడగు నా భూసురుఁ జూచి ధరణిపతి వెఱగు పడుచు నార్యా ! మీ నివాసదేశ మెయ్యది? మీరేవిద్యలం జదివితిరి ? మీ యభిఖ్యావర్ణంబు లెట్టివి? ఏమి పనికై యరుదెంచితిరి? మీ వృత్తాంతం బెఱింగించి శ్రోత్రానందం బాపాదింపుఁడని యడిగిన నతం డిట్లనియె.

దేవా ! నాజన్మభూమి యిదియే. నా పేరు యజ్ఞదత్తుండందురు. నేనుఁ బాల్యముననే మాతాపితృ విహీనుండనగుటఁ గాశీపురంబున కరిగి యందు విద్యాభ్యాసముఁ గావించితిని, వేదంబులు సాంగముగాఁ జదివితిని, శాస్త్రములు సాంతముగా బరిశీలించితిని. పురాణంబు లరసితిని వేదాంత రహస్యముల గ్రహించితిని. పెక్కు లేల, నన్ని విద్యలయందును గొంచెము గొంచెము పాండిత్యము సంపాదించితిని. కాశీలో యుపాధ్యాయుఁడ ననిపించుకొని కొలది దినముల క్రిందటనే యివ్వీటి కరుదెంచితిని ధర్మస్వరూపులైన దేవర మా దేశము పాలించుచున్నారని విని మిగుల నానందించుచు దర్శనముచేసి పోవలయునని వచ్చితిని. వేఱొండపని యెద్దియులేదని విని తదీయ విద్యావినయ విశేషంబుల కానందించుచు నాభూపతి యిట్లనియె.

విద్వత్ప్రవరా ! నీ యభిప్రాయము కడు స్వల్పమైనను విద్యా గుణంబులు పెద్దవిగా నున్నయవి జన్మదేశాభిమానంబునం జేసి యిప్పురంబున కరుదెంచితివిగదా ? నీవెందేగినఁ బూజింపఁ బడకుందువు భవదాగమునం --మామక పురాకృతభాగదేయంపుఁ నింపు ప్రకటించుచున్నది నేఁడు మొదలు నీవు నాకు విద్వాంసుడవై మంత్రివై సకల కార్యంబులయందును తోడునీడవై మెలగుచుండుము అని పలుకుటయు నా విద్వ త్తిలకుండు తత్పర్దాణంబుల కనుమోదించి యట్లు గావింపుచుండెను.

పండిత ప్రియుఁడగు నా నరనాధుండు తిధ కోరం పు తిశయగు సురూప మహానయ గాలక్రమంబన యవర్తుంచు లక్ష్మీసరస్వతులనే జెండా నించెను. నుకూలమై వర్తింప పరింపుకి పరమ సంతోషముతోఁ గాలక్షేపము సెను.