(9)
కపట శివానందయోగి కథ
65
వైరాగ్య ప్రవృత్తి వెన్నతోఁ బెట్టంబడినది. ఈమె పుట్టినదిగోలె తండ్రి పెండ్లి చేయవలయునని ప్రయత్నము సేయుచుండెను. ఈమెకు సంసారమునం దిష్టము లేక పెండ్లి యాడనని పల్కుచుండునది. నీయన్న గారి చిత్రఫలక మొకప్పుడుచూచి యతఁడే యీమెకుం దగినవాఁడని మాఱేనితోఁ జెప్పితిని. దాననే యాయన మీకు శుభలేఖ వ్రాసెను. అది యట్లుండఁ గన్నెరికము వదలుటకై తలిదండ్రు లెరుంగకుండ రాజపుత్రిక యొక మునికుమారుం బెండ్లియాడినది. ఇప్పుడా మాటవిని వారు మీకేమి వ్రాయుటకు తోచక సిగ్గుపడుచున్నారు. ఇదియే యిక్కడి వృత్తాంతము. తల్లీ ! ఈమె మహర్షి పత్ని కావున మీకు వంద్యురాలని యప్పటికిఁ దగినట్లామెతో మాట్లాడినది.
ఆ మాటలలో గొన్ని వినిపించుకొనిన యట్లభినయించుచు సావిత్రి హేమా ! నా సహోదరుఁడు రూపమున మన్మధుండైనను విద్యల బృహస్పతియైనను శ్రీశుకుండువోలె పిన్ననాటంగోలె వేదాంత వార్తాశ్రవణాసక్తిఁగలిగి తండ్రి పెండ్లి యాడమనిన వినుపించుకొనక మే మెరుంగకుండ సన్యాసులలోఁ గలసి హిమవత్పర్వత ప్రాంతములకరిగి తిరిగి తిరిగి జడలు పెంచుకొని నారబట్టలు ధరించి మొన్ననే యింటికి వచ్చెను. మా తండ్రి మిగుల సంతసించుచు నిఁక బెండ్లి చేసి విడిచినం గాని వీని వైరాగ్య ప్రవృత్తి మానదని నిశ్చయించుచుండ నింతలో మీ తండ్రిగారు వ్రాసిన శుభలేఖ వచ్చినది. అందులకు సంతోషింపుచు పెండ్లియాడెదవాయని వానినడిగిరి. నా సోదరుండు నవ్వుంచు నాకు మునుపే పెండ్లి యైనదనియు నా భార్య యెక్కడనో యున్నదనియు నిఁక నాకుఁ బెండ్లి యక్కరలేదనియుఁ జెప్పినంత నది వేదాంత ప్రవృత్తియని నిశ్చయించి మా తండ్రిగారు వానికి బలవంతముగా బెండ్లిజేయఁ దలచికొని యున్నారు.
నీ గుణంబులు వాని గుణంబులతోఁ బెనివడఁగలవని యింతగాఁజెప్పు చున్నాను. మీ తండ్రితోఁజెప్పి శుభముహూర్తము వేగముగాఁ బెట్టింపుమని పలుకుటయు హేమయు స్వయంప్రభయు నొండొరుల మొగములు చూచుకొనుచున్నారు. అప్పుడు సావిత్రి హేమతో జనాంతికముగా బోటీ ! నా మాటలకు మీరేమియో యనుకొను చున్నారు. సందియమేదేని గలిగిన నడుగవచ్చుననుటయు హేమ కామినీ! మరేమియును లేదు మా రాజపుత్రిక వరించిన యోగి మీయన్నగారేమోయని సందియపడుచున్నాము. తెలియఁ జెప్పఁగలవాయని యడిగిన సావిత్రి యిట్లనియె.
హేమా ! మీ సందియములు తీర్చినట్లేయున్నవి. భగవంతుడు విచిత్ర సంఘటనను గావించుచుండును. అద్వైత శివానందయోగి యనిపేరు బెట్టుకొనియే మాయన్న దేశాటనముఁ జేసెను. తెలిసినది. తెలిసినది. మీరు స్వయం ప్రభయను రాజపుత్రికను బెండ్లి చేయుటకు నిశ్చయించితిమని చెప్పగా మాయన్న నవ్వుచు నేనిదివరకే పెండ్లియాడి యుంటినని యుత్తరముసెప్పెను. ఆ మాట మాకేమియు