64
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
యుత్త రము నిజానిజంబులు విమర్శింపకఁ దన కూఁతుంబెండ్లి కూతుంజూచి మాట్లాడుటకు మన వీటికిం బంపుచున్నాడఁట, ఇంతకు ముందే యా పత్రిక వచ్చినది. ఇప్పుడు మనమేమి చేయఁదగినది. సీ ? ఆఁడుజాతి పాడుజాతికదా? అందువలననే వీరికి స్వతంత్రమీయఁగూడదని ధర్మశాస్త్రవేత్తలు వ్రాసియున్నారు. నే నా యోగిని స్వయంప్రభాదేవి కోవెలమంటపములో నుండఁగా జూచి రుద్రాక్షమాలికఁ గానుకగ నిచ్చితిని. అతం డితండు కాడని నేమి చెప్పఁదగినది. స్నేహముపాశము నా హృదయమునఁ బెనఁగొని కదలనిచ్చుటలేదు. ఇదియే మరియొకరైనచో నెంతపని నైనఁ జేయుదునని యలుకతోఁ బలుకుచున్న ప్రాణనాధు నోదార్చుచు మనోహరిణి యిట్లనియె నాధా ? దానికర్మ మట్లున్నది కనుక మీరట్లు నిందించుచున్నారు. అది యే పాసము నెరుంగదు. అది వరించిన మహర్షిరూపవంతు డనియుఁ దేజశ్శాలి యనియు హేమ మొదటనే నాతోఁజెప్పినది నడుమ వీ డెక్కడనుండి వచ్చెనో తెలియదు. ఆ విషయము విమర్శింపక యూరక దాని నిందించుచున్నారు. అది కడు మానసుస్థురాలుసుఁడీ ! అవమానము సహించునదికాదు. అందరివలెనే యది భోగముల కాశపడదు. మహర్షియని యంగీకరించినది. గర్భవతియైనది తొందర యేమివచ్చినది. నెమ్మదిగా విమర్శింతుము గాక. భూరిశ్రవుని కూఁతురు వచ్చెనేని మర్యాదగా స్వయంప్రభయొద్దకే యంపుదము. ఈ వృత్తాంత మక్కడనే తెలిసికొని యచ్చెలువ వచ్చినదారిఁ బోవగలదు. దీనికింత వ్యాఖ్యానము సేయనేలయని భార్య పలికిన భూవల్లభుండు మారుమాట చెప్పక యట్లేచేయుటకు నిశ్చయించెను.
ఆ మరునాఁడే సావిత్రి వచ్చినదను వార్తవిని స్వయంప్రభకుఁ దెలియఁజేయుచుఁ గొందరసుందరుల నెదురుఁబంపి యెంతయేని గౌరవముఁ గావింపజేసెను. స్వయంప్రభయుఁ దండ్రిపంపిన యుత్తరముఁ జదివికొని హేమతోఁ బ్రశంసించిన యుద్యాన వనమున కరుదెంచెడి సావిత్రి కెదురు వోయినది రాజపుత్రిక లిరువు రొకరి నొకరుఁ జూచుకొని యాలింగనముఁ జేసికొని యన్యోన్యము కుశల ప్రశ్నలు చేసికొనిరి.
సావిత్రి స్వయంప్రభా సౌందర్యాతిశయములుజూచి విస్మయము జెందగా యిట్లనియె. సఖీ ! నీ చార్మిత మంతకుముందే యద్భుతముగా వినుచుంటిమి. ప్రేమించుంటిను. దానినన్నపున జారుకుంది. నీ సునందులను పచ్చికొనియే మాతండ్రి నీపు కోగలప గుడువని గురక లూసు కన్నా తం న సంశమెల్ల నికరంబున విఖ్యాతి నౌందగలదని. తముల ఆయుచున్న సిబ్బటి సభినయించుచు స్వయం సమ రామయు సౌవి తికలిములియై దేవి: నీపనట్లు మా రాజపుతు సుగుణమణుల పేటికయ కేమియు సండియములేదు. ఆమెకు