Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కపట శివానందయోగి కథ

63

మేము మాత్రము వట్టి ఛాందస్సుల మనుకొంటివా యేమి నవరసముల నెరింగినవారమే? మీ యిష్టమువచ్చిన వేడుకం గావింపుఁడు. కోపమేమియుం జేయనని చెప్పెను.

అప్పుడొక్క దాశీకన్యక నలంకరించి దీసికొనివచ్చి మంచముపైఁ గూర్చుండఁ బెట్టిరి. ఆ యతి రెండవదెసఁ గూర్చుండెను. పిమ్మట వధూవరులచే మొదట గంధముఁ బూయించిరి. తరువాత నొక ధూర్త బావగారూ ! మీ జడ లంటించుకొని నట్లున్న వేమని పలుకుచు జడలు లాగినది. అవి చేతిలోనికూడి వచ్చినవి. మరియొక్కతె యీ గడ్డము జటలవంటిదే కాఁబోలునని లాగినది. వేఱొకతె వల్కలము చించినది. ఇంకొకతె ముళ్ళు గ్రుచ్చినది. ఒకతె గోమయోదకముఁ జల్లినది. ఒకతె యుమిసినది. అతండు పెద్దతడవు దనుకఁ బరిహాస కృత్యములని తలంచి యతియిష్టమున నా చర్యల సహించు కొనుచుండెను. అవి క్రమ క్రమముగా ముదిరి ప్రహారణములుగా మారినంతఁ దాళలేక అయ్యో ! అయ్యో ఇదియేమి హాస్యము ఇదియేమి వేడుక? రాజపుత్రికయే మరియు బాధించుచున్నదే ? నిలువలేను రక్షింపుడు. రక్షింపుడు పోనిండు, పోనిండని యరచుచు మంచము దిగి యిటు నటు పరుగిడుచు కేకలు పెట్టుచుండెను. ఆ రోదన ధ్వనివిని రాజపుత్రిక హేమను నట్లు చేయవలదని మందలించినది.

అప్పుడు హేమ ధూర్తాంగనలతో వలదు వలదు. ఇఁకనూరకుండుడు. అయ్యగారికి హాస్యరసము తెలియదు. కోపము చేయుచున్నారని పలుకుచు స్వామీ ? మీరు త్రికాలవేదులుగదా? నేఁడిటుల జరుగునని తెలియదాయేమి? ఒకదినము హాస్యమునకే మీరిట్లు భయపడుచున్నారే? ఇంతకన్నఁ జేయదగిన రహస్యములు చాలఁ గలిగియున్నవి. వానికెట్లు తాళగలరని యడిగిన నతండు వివశుండై యిట్లనియె.

అబ్బా ! ఈ దెబ్బల కెవ్వఁడు తాళఁగలడు. నాకు రాజపుత్రిక యక్కరలేదు. నాదారి నన్నుఁ బోనీయుఁడని బ్రతిమాలుటయు హేమ అన్నన్నా ! మా రాజపుత్రికం బెండ్లియాడి విడచిపోవుదుననిన సమ్మతింతుమా ? నిలు నిలుమని యదలించినది. ఆరాత్రి అతనికి కాళరాత్రివలె భయంకరమై తోచినది.

అని యెరింగించుటవరకు వేళ యతిక్రమించుటయు నవ్వని కథ మణిసిద్ధుండు తదనంతరావ పధంబున నిట్లని చెప్పఁదొడంగెను.

అరువది యైదవ మజిలీ కథ

అయ్యో ! స్వయంప్రభాదేవి వరమునం బుట్టియు మనపట్టి యిట్టి నికృష్టపు నింద పాల్పడుచున్న దేమి ? కొన్ని దినములు బెండ్లియే యాడనని బాధపెట్టినది. తరువాత సన్యాసిని పెండ్లియాడితినని చెప్పినది. ఆ మాటనమ్మి ---------- భోగినిఁజేసి తీసికొని వచ్చితిమి. వానింజూచి తాను వరించిన సన్యాసి


మరియొకండని యిప్పుడు తెలియఁజేయుచున్నది. ఆ తగవట్లుండ భూరిశ్రవుని కుమారునికి దీనినిత్తుమని శుభలేఖలు వ్రాసితిమిగదా ? అతండు మన