Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(8)

అద్వైత శివానందయోగి కథ

57

చ. అమరగమున్ను శంకరునియంతటివాఁడల బ్రహ్మచారి రూ
    పము ధరియించి పార్వతిఁ గృపామతిఁ గై కొనడే ! సుభద్ర న
    య్యమరవరాత్మజుండు మహాయతియై గయిపట్టలేదె త
    త్క్రమమున నింద్రమిత్రుని సుతన్ వరియించితి నెనుదప్పొకో.

అని చావడిలోఁ గూర్చుండి సహదేవుఁడు వసుమిత్రుఁడను మిత్రునితో సంభాషించుచుండ నొకపరిచారికవచ్చి రాజపుత్రా ! మీసహోదరి సావిత్రి మిమ్ము లోపలికి రమ్మన్నది. వేగిరండని పిలచిన నతం డిప్పుడేవత్తు నిందుండమని వసుమిత్రునకుఁజెప్పి యంతఃపురంబున కరిగి చెల్లెలింగాంచి గారవించి కుశలంబడుగుటయు నక్కలకంఠి యిట్లనియె.

అన్నా ! నీవరిఁగి కొంచెముకాలమైనను యుగాంతరము లయినట్లున్నదిగదా? ఎందెందుఁ దిరిగితివి. ఏమేమి వింతలంజూచితివి. తలచిన కార్యము నెరవేరినదా? సవిస్తరముగా నుడువుమని యడుగుటయు నారాజుపుత్రుండు నవ్వుచు నిట్లనియె. సోదరీమణి! నీ యాలోచన వడువున నడిపించిన కార్యమేల సాఫల్యము కాకపోయెడిది. వినుము నీతోఁ జెప్పియొక్కరుండ పురమువెడలి కతిప్రయాణంబున నా గిరిదుర్గపురంబున కరిగి యారాజపుత్రిక చారిత్రము దెలిసికొనుచు గొన్ని దినము లందుంటి. ఆ వాల్గంటి వీణావతి వీణ విఱగఁగొట్టినది మొదలు పట్టణ ప్రజలెల్ల నప్పలవపాణి యిఁక బెండ్లి యాడదు. సన్యాసులలోఁగలసి పోఁగలదని నిశ్చయించుకొని యుండిరి. దానిచేష్టలును నట్లేయున్నవి. ఆమెవీక్షణ దర్శనమైనం చాలునని యెన్నియో ప్రయత్నములుఁ జేసితినిగాని యేమియు ఫలము లేకపోయినది. అప్పుడే నీ కాయుత్తరమువ్రాసి యంపితనిగదా? పిమ్మట నీవు పరిచారిక శారికంబంపి చేయఁదగిన కృత్యములు బోధించితివికదా ? అంతలో దైవికముగా నామిత్రుండు వసుమిత్రుండనువాడు నాకన్ను లంబడియెను. మేమొండొరులము గౌఁగలించుకుని క్షేమ సమాచారములం దెలిసికొంటిమి. పిమ్మట నీవు చెప్పిన యుపాయంబునకు మిక్కిలి సంతసించుచుఁ దానుకూడ సహాయముఁ జేయుదునని వాగ్దానముఁ జేసెను.

అప్పుడు మేము గూఢముగా నారచీరెలును --------------- , రుద్రాక్ష మాలికలు కమండలువులు లోనగువస్తువులెల్ల సంగ్రహించి యా ప్రాంతమందున రత్నకూటశైలపాదంబున వెలసియున్న స్వయంప్రభాదేవి యాలయములో వసియించి యా వేషము వైచుకొంటిని. శారికకు యోగినీవేషము వైచితిని. వసుమిత్రుండు వీటిలో నుండి యచ్చట జరిగినచర్యలన్నియుఁ దెలిసికొని యెప్పటికప్పుడువచ్చి మాతోఁజెప్పునట్లు నియమించితిని. అతండుమిగుల బుద్ధిమంతుండగుట నంతఃపురములలో నుద్యానవనములలో నగరులో జరుగు విశేషములన్నియుం దెలిసికొని గూఢచారుల నియమించి యా వృత్తాంతములెల్ల ముందుగనే మాకుఁ దెలియజేయుచుండువాఁడు. దైవసహాయము లేనిది ఏ కార్యము కొనసాగదు. వీణావతివలనం గొనిన మణిహారమే నా కార్యమునకుఁ