పుట:కాశీమజిలీకథలు-06.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

56

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

గావున నేమనుటకు నోరాడదు. గాని స్వయంప్రభ స్వతంత్రురాలై కులపాలికా ధర్మముల విడనాడినది. తోచినంతయుం గావించినది. చెప్పినంతయుం జేసినది. నాడు చెప్పినమాట పరిహాసమను కొంటిని. యధార్ధమేనట. అని యా కథ యంతయు నామూలచూడముగా వక్కాణించినది.

మేదినీకాంతుఁ డావృత్తాంతము విని స్వాంతమునఁ జింతయు, వగపును, విషాదము, ప్రమోదము, పశ్చాత్తాపము లోనగు గుణంబులన్నియు నొక్కసారి జనింపఁ దెంపుసేయనేరక పీఠమున కొఱగి పెద్ద తడువు ధ్యానించి తనకుఁ దాన సమాధానపరచికొని భార్యకిట్లనియె. సాధ్వీ ! కర్మసూత్రగ్రంధితంబైన జంతువు దానివిడిచి పోవుటకు శక్యంబగునా? అది యెట్లు లాగిన నట్లు పోవలసినదే. మన మేమిచేయుఁ గలము? పొనిమ్ము. అతండు మహానుభావుడని యానందింతము. దౌహిత్రులాభంబు గలుగునని మురియుదము. అని చెప్పుచుండ రాజపత్ని యది యట్లుండె, భూరిశ్రవునికి వార్త నంపితిమిగదా యతనికేమని చెప్పవలయును? ఈ యపకీర్తి మన యావజ్జీవము బాధించునుగదా? అందులకేమి చింతించితికాని యడిగిన నతం డాలోచించి ప్రస్తుతము ముహూర్త మాపితిమనియు వెండియుం దెలియఁ జేయుదనుక రావలదనియు వ్రాయింతుమని చెప్పి యట్ల గావించెను.

రాజపత్ని యర్థసంతోషముతో నాధా ! ఆయోగి పూర్వజన్మంబున నెక్కుడు పుణ్యంబు గావించుటంబట్టి నాపట్టి చేపట్టినది. ఇఁక చెట్టునీడల వసియింపనేల? మీరు పోయి సబహుమానముగా మనయింటికిం దీసికొనిరండు. లేనిచో సరివారు పరిహసింతురని బోధించిన ---నకనాధుండేమిచేయుటకుం దోచక విధిలేక యమ్మరునాఁడు తగు పరివారము సేవింప మేళతాళములతో నగ్గిరిపరిసరమున కరిగి యయ్యతికి నమస్కరించుచు స్వామీ! మిమ్ము నాకూఁతురు భర్తగా వరించిన దఁట. మీరిందుండనేల? వీటిలోనికి రండు. ఉద్యానవనము తపోవన మగుంగాక యని కోరిన నతండు రాజా! నీ కట్టియభిప్రాయముండిన ద్రోసివేయనేల? ఇదిగో? వచ్చుచున్నాఁడ నని లేచి తన్నిర్దిష్టంబగు నందలమెక్కి యధిక వైభవముతో నగరుఁ బ్రవేశించెను.

అని యెరింగించి వేళయతిక్రమించుటయు మణిసిద్ధుఁ డవ్వలి కథ తదనంతరోవసధంబున నిట్లని చెప్పం దొడంగెను.

అరువది నాలుగవ మజిలీ

చ. అలరుచుఁ బెండ్లియన్న విని యాజ్యము వోసినక పోతుంది
    రలుక వహించి మండెడునృపాత్మజ నోజఁ దనంతవచ్చి స
    కౌనంగఁ జేసి తప్పుగా ? వెరులను త్వరత్వ
    తృణ నియమ ప్రభావములు మాకు వంది మత్రమా.

అని పరిహాసమాడిన మిత్రునితో