అద్వైత శివానందయోగి కథ
55
హేమ : - ఔను. ఆతఁడే !
రాజ :- ఔరా ! చక్రవర్తి కడుపునంబుట్టి నాపట్టి చివరకు సన్యాసిం జేపట్టెనా ? నాబిడ్డ కెన్ని పాట్లు వచ్చినవి. (అని విచారించెను)
హేమ :-- అతండు సన్యాసియని నిరసింపరాదు. రూపంబునను బ్రాయంబునను గంతు వసంతాదుల మించియున్న వాఁడు మీరు చూడలేదు. కావున నట్లను చున్నారు.
రాజ :- అది మొదటినుండియు సన్యాసులలోఁ గలియవలయు ననియే పల్కుచున్నది. ఆ పలుకే నిజము చేసినది. పోనిమ్ము. చింత యేమిటికి?
మీకు దౌహిత్రుఁడు కలుగఁగలడు. అట్టి లక్షణములు గనంబడుచున్నవి. అందులకే యీచిన్నది వగచుచున్నది.
రాజ :- (సంతోష విశాదములతో బక్కున నవ్వుచ్చు) వెర్రిపట్టీ ! నీ చర్యలు విన నవ్వు వచ్చుచున్నదిగదా ! అయ్యో ! నీచరితమువిని లోకులు పరిహసింపక మానరు.
అనుటయు నామాటవిని యత్తరుణీమణియుఁ బెద్దగానేడువ దొడంగినది. రాజపత్ని తత్పరివేదనము విని సహింపనేరక గడ్డముబట్టుకొని కన్నీరుఁ దుడుచుచు పట్టీ ! మాటవరుస కట్లంటినిగాని నీకువచ్చిన కొదువ యేమియునులేదు. అగస్త్యునిఁ బెండ్లి యాడిన లోపాముద్రపలె నీవును నమ్మహర్షితో సుఖింతువుగాక ! నీవు విచారింపకుము. గర్భవతి వైతివి. మా కుల ముద్ధరింపఁగలవు ఇంతకన్నఁ గావలసిన దేమి? ఈ మాటవిని మీతండ్రియుం గోపింపరు సంతసముతో నల్లునిందెచ్చికొని యింటం బెట్టికొనియెదము. అని పెద్దతడపుబ్రతిమాడి యా బాలిక మనోవ్యధఁ గొంత జల్లార్పఁ జేసి హేమా! నీ వీపనికి సహకారివై యుందువు. ఆ తపస్వి యా గిరి దుర్గమున నుండ నేల? ఇంటికిం దీసికొనిరమ్ము. రాజ్యభోగము లనుభవింపఁగలడని పలికినది.
ఆమాట విని హేమ అమ్మా ! అమ్మహర్షి యమ్మరునాడే యిక్కడనుండి యెక్కడికో పోయెను. అని చెప్పుటయు జాలుజాలు ! బొంకులాడెద వేమిటికి? ఈ నడుమ పుడమిరేడు రెండుసారు లచ్చటికిం బోయి చూచి వచ్చెను. వారికి రుద్రాక్షమాలఁగూడ కానుక నిచ్చిరి. పోపొమ్ము. మరలఁజూచిరమ్మని పలుకుచు పుత్రి నోదార్చి రాజపత్ని తనయంతఃపురమున కరిగినది. ఆమె రాక వేచియున్న యింద్రమిత్రుడు సంతోషముతో భార్యం జూచి ప్రేయసీ ! మనము పంపిన బ్రాహ్మణులు ప్రత్యుత్తరమును దీసికొనివచ్చిరి. భూరిశ్రవుఁడు సంతసించుచు మనము నిరూపించిన సుముహూర్తమునకు వత్తుమని వ్రాసియున్నాఁడు. ఇఁక మనము పెండ్లి ప్రయత్నములు చేయవచ్చును. పలుకుచుండ నించుక చింతించుచు కన్నీరు దుడిచికొని యప్పల్లవపాణి యిట్లనియె.
ప్రాణేశ్వరా! మనము వైభవములకు బెట్టి పుట్టలేదు. మన కన్నులు మంచివికావు. మన ప్రయత్నములు నిరర్ధకరములు. వినుండు కడుపునఁ బుట్టినది