అద్వైత శివానందయోగి కథ
47
అని యెరింగించువరకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుం డవ్వలి మజిలీయందు తదనంతరోదంతం బిట్లని చెప్పఁ దొడంగెను.
అరువది రెండవ మజిలీ
అయ్యా ! మే మేమి నేరముఁ జేసితిమి అక్రమముగా మమ్మిట్లు బద్దులుఁగా జేసికొని పోవుచుంటిరే ! ధర్మస్వరూపులైన రాజులే యన్యాయములు సేవింపుచుండఁ గాదనువా రెవ్వరు ? రాజపుత్రిక పారితోషిక మిచ్చినం గైకొంటిమి. అది యిప్పుడే సహదేవుడను రాజకుమారున కమ్ముకొంటిమి, ఇప్పుడా మండనముఁ దెమ్మనిన నెట్లు తెత్తుము. అందలివి మణులో గాజుపూసలో యెవరు పరీక్షించిరి అని దీనస్వరముతో వేడుకొనుచుండ వీణావతినిఁ తల్లినిం బట్టుకొని రాజభటులు వారిని గిరిదుర్గమునకుం దీసికొని వచ్చిరి.
రాజదూతలు వేశ్యలవలనఁ గొంతలంచము గొనినవారగుట నంతగా వారిని బాధింపక గౌరవముగానే యొకబసలోఁ బ్రవేశ పెట్టిరి. అప్పటి కింద్రమిత్రుడు గ్రామాంతర మరిగియున్నవాఁడు గాన వెంటనే యాబోటుల వారి యపరాధము విమర్శింపఁ గొల్వుకూటమునకు తీసికొనిపోవ నవసరము లేకపోయినది. ఈ లోపల వీణావతి తనకు మండనముఁ భారితోషికముగా నిచ్చిన రాజపుత్రిక యొద్దకుఁబోయి తమనిర్బంధములఁ జెప్పికొని వచ్చెదము సెలవిండని రక్షకభటుల గోరికొని యొకఁనాడు ప్రాతఃకాలమున నయుద్యాన వనమున కరిగినది.
వెనుక తనకుఁ బరిచయము కలిగిన యొకపరిచారికం జేరి నారాక భర్తృదారికకు నివేదించి రమ్మని కోరిన నా దూతిక గురుతుపట్టి వీణావతీ ! మా రాజపుత్రిక మూఁడు దినములనుండి పీడఁజెందియున్నది. ఈవలకు వచ్చుటలేదు. నేఁడు కొంచెము నెమ్మదిగా నున్నది. ఇంతకుముందే పూవుఁదోటఁజూచి పోయినది. డప్పరిగపై నిప్పుడు హేమతో నెద్దియో ముచ్చటించుచున్నది. అవసరముఁజూచి నీవార్త నెరింగించి వచ్చెద నాలస్యమునకు శంకింపక నిందేయుండుమనిచెప్పి యప్పరిచారిక యుప్పరిగకుం బోయినది అప్పుడు తలుపులువైచుకొని రాజపుత్రిక హేమతో నిట్టు సంభాషించుచున్నది.
సఖీ ! హేమా ! నీతో నేమి చెప్పుదును. ఏమనుటకును. వాక్కు రాకున్నది. సీ ! నా నీమము లన్నియును గంగపాలైనవి. వినుము నీవరిగిన వెనుక లజ్జాభయ విషాదములతో నయ్యోగినివెంటఁ దిరుగుచుంటి ఆమెకు మంచిమాటల జెప్పుచు సంతోషముతోఁ గాలక్షేపముఁ గావించినది. అందలి పూవులం గోసుకొనివచ్చి నన్నుఁ ఏంజేసి భోజనం మనం నవరా పౌరునిక మ ంకరించిన నీవు మునిపుత్రుడును మూడు రాత్రు లేకశయ్యాగతుపై సమండవలెను. నయ్యోగిని రాజపు