పుట:కాశీమజిలీకథలు-06.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

42

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

లేచు వేళయైనది. చూచి వచ్చెద నిందుండుమని పలుకుచు నా గుడిలోనికిఁ బోయినది.

అప్పుడు రాజపుత్రి హేమతో సఖీ! ఈఁబోటిమాటలు వింటివా ! ఈ తపస్వి నన్నుఁ గూడఁ బెండ్లియాడుమని నిర్బంధించునా యేమి? అయ్యో ! ఆడుదానినై పుట్టితి నేమిపాపము, పెండ్లియాడి బిడ్డలఁగని సంసారకూపములోఁ బడిపోవలసినదా? సీ ! ఇంతకన్న మరణమే శ్రేయము. అని పలికిన హేమ యిట్లనియె. కాంతా ! నీకింత భేదమేమిటికి? ఆయన నిన్నుఁ బెండ్లియాడుమని నిర్బంధించినపుడు నాకు విరక్తుండెవ్వఁడును దొరకడు. నీవే నన్ను భార్యగా స్వీకరించుమని కోరుకొనుము. ఏమని యుత్తరమిచ్చునో చూతముగాక యనుటయు స్వయంప్రభ చాలు చాలు. మంచి మాటయే చెప్పితివి. అట్టిమాట యనినచో నప్పుడే శపించి విడచును. తాపసులు ముక్కోపులని యెరుంగవు కాఁబోలు. నీ పరిహాసోక్తులకేమి పోనిమ్ము అదిగో ! ఆయోగిని యేదియో చేతంబట్టుకొని వచ్చుచున్నది. నీ వవ్వలికిం బొమ్మని పలికినది.

అంతలో రత్నమాల హస్తంబుదాల్చి యోగిని యా మంటపము దాపునకువచ్చి రాజపుత్రీ! ఈ హార మెవ్వరిదో చెప్పుకొనుము. అని పలుకుచు చేతికిచ్చుచున్నది. అచ్చిగురుబోణి దానిం బుచ్చుకొని విస్మయ మభినయించుచు హేమా ! యిటురా. చూడు మిదిగో మన హారము. ఇమ్మహాత్ముండు తెప్పించి యిచ్చే. ఔరా ! ఏమి యీ వింత. దేవీ ! ఈహార మెట్లువచ్చినది అచ్చట నేమి జరిగినది. ఏమని చెప్పితివి ? అమ్మహర్షి యేమని యుత్తరము సెప్పెను. వడిఁగా జెప్పుమని యడిగిన నామె యిట్లనియె

రాజపుత్రీ ! తపంబునకు సాధ్యముగానిది యున్నదియా ? నీరాకయు మన సంవాదము లోనగు విషయంబు లన్నియు నాయన దివ్యదృష్టిం గాంచిరి. నేను పోయినతోడనే పెండ్లివిషయమై యిదివరకు నీకుఁ జెప్పినది నిక్కువము. వేఱొక్కటి చెప్పనవసరములేదు. అని నేనడుగకమున్నే నా కుత్తరము సెప్పి ధ్యానోప గతంబైన యీ మణిహారము నాకిచ్చి యంతలోఁ గన్నులు మూసికొనియెను. లోక ప్రసక్తినిమిత్త మమ్మహాత్ముఁడు చెప్పిన విని స్వయంప్రభ తత్ప్రభావమునకు త్ముని దర్శనము సేవింపుమని యమ్కంచుకోగం దాలంటే. యా కోమాలోకి తీసికొని సుండిప అని పలుకుచు వారిం ఇమ్మహాక్కుండు తెప్పించి. ఓట్లు వచ్చినది అచ్చం యుత్తరము సెప్పెను. త్యజముందుకు నమ్మ చేయింబసుకొని ev సేవింపవచ్చినది. కూత వసతుకారిం తీయందని. పిలిచినది. అప్పుడు.