పుట:కాశీమజిలీకథలు-06.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(6)

అద్వైత శివానందయోగి కథ

41

రాజపుత్రీ ! నీ వడిగిన మొదటిప్రశ్నముఁ గురించి యీవర కాయనకును నాకును బెద్దగా వాదము జరిగినది. మా సంవాదము వింటివేని నీ సందియముఁ దీరఁగలదు. ఎట్టి విరక్తిఁ గలిగియున్నను నెట్టి సుజ్ఞానముఁ జెందియున్నను ఎట్టి ప్రజ్ఞావతియైనను యువతి వివాహ మాడకతీరదు. ఎవ్వనినో యొకని భర్తగా వరింపక తప్పదని ధర్మశాస్త్రములలో నున్నదట. అవివాహతయగు కాంత లోకాంతమున వంతఁజెందునని యయ్యగారును సెలవిచ్చి నన్నిప్పుడు పెండ్ల యాడక తీరదని నిర్బంధించుచున్నారు. నే నటుపై మహాత్మా ! ఆఁడుదానికి భర్తను వరించినపిమ్మట నతని యానతిలోనై యుండవలయును గదా ! అతండు సంసారసక్తుండగుటఁ గామాసక్తిం బ్రవర్తించిన విరక్తిఁగల నెలఁత యేమిచేయందగినది. భోగములు విరక్తికి బాధకములు గదా ! సంతతిఁ బడసిన పడఁతికి నిడుమలేగాని సుఖమున్నదియా? వివేకమెక్కిడిది. మమత్వము బాధింపక విడుచునా ? అనురాగమెట్లు పోగలదు. క్రమంబున సంసార పంకమగ్నయై యధోగతిం బొరయకమానదు. పూఁబోణులకుఁ బెండ్లి వలన నిన్ని బాధకములున్నవి. ఈ ముక్తి కేమి ప్రత్యుత్తరమిత్తురు. వీనింబట్టిచూడ నాఁడుది ముక్తిఁ జెందదని తెల్లమగుచున్నదని యడిగితినని చెప్పిన ముప్పిరిగొను సంతసముతో స్వయంప్రభ యంగునితో నిర్దేశించుచు తల్లీ ! అదియే వేయవలసినప్రశ్న. లెస్సగా నడిగితివి. వైరాగ్యముగల వనిత కామాసక్తుం బెండ్లియాడి యిడుములఁ గుడువవలయునని ధర్మశాస్త్రవేత్తలు చెప్పియుండరు. దాని కెద్దియో ప్రతికూలముండకపోదు. ఆ మాట కయ్యగారేమని యుత్తర మిచ్చిరో నుడువుము. అనుటయు నయ్యోగిని వెండియు నిట్లనియె.

వనితా ! వినుము. నా మాటవిని యయ్యగారు నవ్వుచు సోదరీ ! విరించి కామములనే స్త్రీరూపముగా నిర్మించెను. వాండ్రు కామశూన్య లెట్లగుదురు. వారిమూలముననే పురుషులు కామాసక్తు లగుచున్నారు. అగ్ని కాష్టంబులఁ తృప్తిఁ బొందనట్లు యువతి కామంబులఁ దృప్తిఁ బొందదు. అని భారతములో వ్రాయఁ బడియున్నది. కామినులు కామ విముఖులగుటయే యరుదు. లయ్యెనేని విరక్తునే వరించి పతివ్రతయై ముక్తిఁబొందఁగలదు. తెఱవకు నంతకన్న వేఱొక తెరువులేదు. విరక్తుండు కాంతం బరిగ్రహించునా యందువేమో ! పరోపకారమునకై పరిణయం బగుట మహర్షులకు వాడుకయై యున్నది. అగస్త్యుండును లోనగు మహర్షు లందులకే పెండ్లియాడిరి. కామాసక్తింగాదని యేమేమో బోధించి నా మాటల కన్నిటికి నుత్తరములు సెప్పి వాగ్బంధముఁ గావించెను

వారికన్న మనకెక్కుడు తెలియునా ? అందుల కంగీకరించి యట్టి యుత్తముని వెదకుచుంటి. నీ వడిగిన నీకును నాయుత్తముని ఇప్పుడు సందియములేదు. యువతి పతివ్రతయై ముక్తిఁ బొందునఁట. అని చెప్పుచు గుడిదెస -- గురువుగారు