40
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
దొక్కటియునులేవు. నీ యక్కటికపుచూపే నాపై నీకీ ప్రీతిఁగలుగఁ జేసినది. సంకల్పములెన్ని యేని యుండవచ్చును. వానివలన బ్రయోజనమేమి? త్రికరనంబు లనేక మార్గంబున నడపింపలేని నాఁబోటివారు భయలోకంబులకుం జైడుదురుగదా ! సంసార పంకమగ్నురాలగు నన్నింత పెద్దఁజేసి నుతించుట ఎంతగానున్నది. ఇప్పుడు నీవన్న సద్గుణంబు లన్నియు నీయందు యున్నవి. రూపము ప్రాయము సంపదలు లక్ష్యము సేయక యిమ్మహాత్ముని బాదసేవఁజేయుచున్నావు ధన్యురాలవు. నిన్నుఁగాకయొరులఁ బొగడవలయునా? నాయం దున్నతిభావము విడిచి శిష్యురాలిగా గణించి దుర్గుణముల శిక్షించి భవసాగరమునుండి లేవనెత్తుము. నేను వట్టిమూఢురాల. నా కేమియుం దెలియదు. మదీయ పురాకృత సుకృతము నేటికి ఫలించినది. లేనిచో నంతఁపుర కారా గారమున వసించియున్న నాకు మీవంటివారి దర్శనమగునా? నన్ను గురుకటాక్ష పాత్రురాలిగాఁ జేసి రక్షింప నీదే భారము. తొలుత నీ పదమే పట్టుచున్న దాననని పలుకుచు నామె పాదంబులకు సాష్టాంగ నమస్కారముఁ గావించినది.
అప్పు డాయోగిని యా గజగామినిని గ్రుచ్చియెత్తి కౌఁగలించుచు మించుబోణి ! నిన్నును నన్నును రక్షించువాఁడు వేర యున్నవాఁడు. అతని చరణము పట్టుదువుగాక ! ఏనును నీబోటిదాననే సుమీ! అతండు స్త్రీలపొందు బొత్తుగా సహింపకున్నను నీగుణము లగ్గించుట నీ సేవకనుమోదించును. అతండుసర్వమును దానై యుండును గావున సర్వవృత్తాంతములు కరతలామలకముగఁ దెలిసి కొనఁగలడు. చక్రవర్తుల లక్ష్యపెట్టడు. జ్ఞాను లనిన గౌరవించును. ఒకప్పుడు నీ చరిత్ర మంతయు నెరిఁగినట్లే చెప్పెను. పెక్కు లేల ? నీ నిమిత్తమే యిగ్గుహాంతరమున నింతకాలము వసియించెనని తలంతును. కానిచో నీపాటి కే యరణ్యమునకో పోవలసినవాఁడే వారితో సమయ మరిఁగి మాట్లాడవలయును. బాహ్యప్రచారము గలిగినప్పుడు నీరాక వినిపించివచ్చెద. నీ యభిలాషయెద్దియో చెప్పుమని యెంతయో నై పుణ్యముగా నడిగిన నక్కాంతారత్న మిట్లనియె.
తల్లీ ! నా కే కోరికయు లేదు. తుచ్ఛభోగములకు నా మనసు దూరము. స్వయంప్రభవలె నొకయాశ్రమముఁ గల్పించుకొని తపం బొనరింపవలెనని యున్నది. ఇందులకుఁ జాలవిఘ్నములు గలుగుచున్నవి. నా తలిదండ్రులు మదేకశరణులగుట నాకుఁ బెండ్లిజేసి నావలనఁ గలిగిన సంతతివలన నానందింపఁ దలఁచికొని యున్నారు. అది దుఃఖముల కాలవాలమని యెఱుఁగక నాఁడుదానికిం బెండ్లి యాడనిచోఁ బరము లేదని శాస్త్రవేత్తలచే నాకు బోధింపఁ జేసిరి. దానిఁ జేసి నా హృదయము సందేహ డోలిక నెక్కి యూగుచున్నది. ఈ సందియ మిమ్మహాత్మునివలనఁ దీర్చికొనవలసి యున్నది. మఱియు నాకుఁ బరమార్ధోపదేశముఁ జేసి శిష్యురాలిగా నేలికొనఁ గోరుచున్నదాన అని తన యభిలాష యంతయు నెఱింగించిన నయ్యోగిన నవ్వుచు నిట్లనియె.